అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు | FIR Filed Against Arnab Goswami | Sakshi
Sakshi News home page

అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు

Published Sun, May 6 2018 5:27 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

FIR Filed Against Arnab Goswami - Sakshi

ముంబై: ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత, రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామిపై ముంబైలోని అలీభాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. ఇటీరియర్‌ డిజైనర్‌గా పరిచేస్తున్న అన్వాయ్‌ నాయక్‌ తనకు అర్నాబ్‌ గోస్వామి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని, శనివారం అలీభాగ్‌లోని తన బంగ్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాయక్‌ వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా ఆయన భార్య అలీభాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

నాయక్‌ భార్య అక్షత ఫిర్యాదు మేరకు గోస్వామితో సహా మరో ఇద్దరు ఫిరోజ్‌ షేక్‌, నితీష్‌ సార్థాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ పోలీస్‌ అధికారి సంజయ్‌ పాటిల్‌ తెలిపారు. రిపబ్లిక్‌ టీవీ నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాయక్‌ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్‌ టీవీ మాత్రం అక్షత ఆరోపణలను ఖండించింది. నాయక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్దతిలో మొత్తం చెల్లించామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆధారాలను తగిన సమయంలో అధికారుల ముందు ఉంచుతామని పేర్కొంది. నాయక్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాయక్‌ భార్య చేస్తున్న ఆరోపణలపై స్పష్టత లేదని, పూర్తి ఆధారాలు లభ్యమయేవరకు ఎవ్వరిని అరెస్ట్‌ చేయమని పోలీస్‌ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement