సుప్రీంపై వ్యంగ్యాస్త్రాలు.. కోర్టుకు కమెడియన్ | Comic Kunal Kamra Facing Contempt Charge Over His Comments On SC | Sakshi
Sakshi News home page

సుప్రీంపై అనుచిత వ్యాఖ్యలు.. కోర్టుకు ప్రముఖ కమెడియన్‌

Published Fri, Nov 13 2020 3:12 PM | Last Updated on Fri, Nov 13 2020 4:09 PM

Comic Kunal Kamra Facing Contempt Charge Over His Comments On SC - Sakshi

ముంబై: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఆర్నబ్‌ గోస్వామికి బెయిల్‌ మంజూరు చేసి సుప్రీం కోర్టుపై పోలిటికల్‌ కామెంటర్‌, ప్రముఖ ముంబై కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ సర్వోన్నత న్నాయస్థానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించి చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కమ్రా తన వ్యాఖ్యాలను వెనకకు తీసుకోబోనని, క్షమాపణలు చేప్పేది లేదంటూ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశాడు. శుక్రవారం కుమ్రా ట్వీట్‌ చేస్తూ ‘న్యాయవాదులు లేరు, క్షమాపణలు లేవు, జరిమాన లేదు’ అని చేతులు జోడించి ఉన్న ఎమోజీలను జత చేశాడు. (చదవండి: అర్నాబ్‌ గోస్వామికి ఊరట)

దీంతో అత్యున్నత న్యాయస్థానంపై అతడు చేసిన వ్యాఖ్యలకు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది న్యాయవాదులు కమ్రాను కోర్టులో హాజరుపరచడానికి అతడిపై కోర్టు ధిక్కారణ కేసుకు అనుమితివ్వాల్సిందిగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరారు. ఆయన వారికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్రా తన హద్దులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టుపై దాడి చేయడం అన్యాయమని, ధైర్యమైన శిక్షకు దారి తీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయం ఇది’ అంటూ కమ్రాను కోర్టుకు తీసుకెళ్లడానికి అనుమతిస్తూ ఈ లేఖను అందించారు. (చదవండి: కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement