abetment to suicide
-
ప్రముఖ నటుడు రాజన్ పి దేవ్ కొడుకు అరెస్ట్
తిరువనంతపురం: దక్షిణాది నటుడు, దివంగత రాజన్ పి దేవ్ కొడుకు ఉన్ని రాజన్ అరెస్టయ్యాడు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అతన్ని చాలారోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ రావడంతో నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు ఎదురు చూశారు. కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్‌గా, విలన్‌గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంకకు వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రియాంకను భర్త ఉన్ని ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తోంది. అంతేకాదు ఓరోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడే. 200 సినిమాలకు పైనే నటించిన రాజన్ పి దేవ్.. 2009లో లివర్ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది. -
అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదు
ముంబై: ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబైలోని అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇటీరియర్ డిజైనర్‌గా పరిచేస్తున్న అన్వాయ్ నాయక్ తనకు అర్నాబ్ గోస్వామి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని, శనివారం అలీభాగ్‌లోని తన బంగ్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాయక్ వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆయన భార్య అలీభాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. నాయక్ భార్య అక్షత ఫిర్యాదు మేరకు గోస్వామితో సహా మరో ఇద్దరు ఫిరోజ్ షేక్, నితీష్ సార్థాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారి సంజయ్ పాటిల్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నాయక్ భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ మాత్రం అక్షత ఆరోపణలను ఖండించింది. నాయక్‌కు చెల్లించాల్సిన బకాయిలను వాయిదా పద్దతిలో మొత్తం చెల్లించామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆధారాలను తగిన సమయంలో అధికారుల ముందు ఉంచుతామని పేర్కొంది. నాయక్ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నాయక్ భార్య చేస్తున్న ఆరోపణలపై స్పష్టత లేదని, పూర్తి ఆధారాలు లభ్యమయేవరకు ఎవ్వరిని అరెస్ట్ చేయమని పోలీస్ అధికారులు తెలిపారు. -
ఆత్మహత్యకు ప్రేరేపణ: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా పోలీసులు ఈ కేసు పెట్టారు. గుప్తకాశీలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యాపారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈనెల 20వ తేదీన ఆ వ్యాపారి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే సహా మొత్తం పదిమంది వ్యక్తులు అతడి నుంచి భారీ మొత్తాలు తీసుకున్నారని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన తనకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదని చెప్పి ఓ లేఖ రాసిన సదరు వ్యాపారి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారి నుంచి ఎమ్మెల్యే రూ. 42 లక్షలను అప్పుగా తీసుకున్నాడని అతడి భార్య తెలిపారు.