తిరువనంతపురం: దక్షిణాది నటుడు, దివంగత రాజన్ పి దేవ్ కొడుకు ఉన్ని రాజన్ అరెస్టయ్యాడు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అతన్ని చాలారోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ రావడంతో నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు ఎదురు చూశారు.
కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్‌గా, విలన్‌గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంకకు వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రియాంకను భర్త ఉన్ని ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తోంది. అంతేకాదు ఓరోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడే. 200 సినిమాలకు పైనే నటించిన రాజన్ పి దేవ్.. 2009లో లివర్ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది.
భార్య ఆత్మహత్య : రాజన్ పి దేవ్ కొడుకు అరెస్ట్
Published Wed, May 26 2021 8:11 AM | Last Updated on Wed, May 26 2021 10:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment