domestic voilence
-
టీం ఇండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ షాక్
-
కొడుకు ముందే క్రికెట్ బ్యాట్‌తో ప్రిన్సిపల్‌పై భార్య దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
గృహహింస.. ఈ పేరు వినగానే వేధింపులకు గురవుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. భర్తలు, అత్త మామలు, ఆడపడచుల చిత్ర హింసలకు ఎంతోమంది వివాహితలు బలవుతున్నారు. కానీ భార్య చేతిలో గృహహింసకు గురవుతున్న భర్తల గురించి ఎప్పుడైనా విన్నారా.. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అజిత్‌సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. కాగా అజిత్ సింగ్ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్ తరుచూ అజిత్‌సింగ్‌పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్ సింగ్ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్ బ్యాట్, పాన్, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది. చదవండి: అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం అయితే గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉన్నందున భార్య వేధింపులపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్నానని బాధితుడు అజిత్ సింగ్ తెలిపాడు. కానీ ఇప్పుడామే హద్దులు దాటి ప్రవర్తిస్తుండటంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తన బావ భార్యను హింసకు ప్రేరేపించాడని ఆరోపించాడు. అంతేగాక భార్యపై తనెప్పుడూ చేయి ఎత్తలేదని పేర్కొన్నాడు. తనొక ఉపాధ్యాయుడని..ఉపాధ్యాయుడు ఒక మహిళపై చేయి ఎత్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇష్టం లేదని అన్నాడు. In a strange case of domestic violence, a school principal in #Alwar district of #Rajasthan has move the court seeking protection from the physical and mental harassment of his wife. According to the man, his wife has been beating him black and blue leaving him weak mentally. pic.twitter.com/J1UOmRhyHw — IANS (@ians_india) May 25, 2022 -
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
దురదృష్టం భర్తల కోసం గృహహింస చట్టం లేదు: హైకోర్టు
చెన్నై: మహిళల కోసం గృహ హింస చట్టం తీసుకొచ్చినప్పటికి ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. అయితే ఇక్కడ విచారకర అంశం ఏంటంటే బాధితుల కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ విడాకులు రావడానికి 4 రోజుల ముందు భర్త తనపై గృహహింసకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా అధికారులు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్ విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు దురదృష్టం కొద్ది భర్తలను వేధించే భార్యలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి గృహహింస చట్టం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సస్పెండైన అధికారిని తిరిగి డ్యూటీలో నియమించాల్సిందిగా ఆదేశించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. పి.శశికుమార్ అనే డాక్టర్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఈక్రమంలో శశికుమార్ భార్య అతడిపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి.. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసింది. ఆ తరువాత కూడా డాక్టర్ భార్య అతన్ని పలు రకాలుగా మాటలతో హింసించింది. భార్య చేతిలో నరకం చూసిన డాక్టర్ ఇక భరించలేనంటూ ఆమెను వదలి దూరంగా పారిపోయాడు. 2015లో విడాకులకు అప్లై చేస్తే.. 2020 ఈ కేసు విచారణ పూర్తి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో విడాకులు మంజూరు అయ్యేవి. డాక్టర్ భార్య క్రూరత్వం... శశికుమార్‌ను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలని భావించిన అతడి భార్య విడాకుల పిటిషన్ తీర్పుకు నాలుగు రోజుల ముందు, కోర్టులో కొనసాగుతున్న గృహ హింస ఫిర్యాదుకు సంబంధించి పశుసంవర్ధక, పశువైద్య సేవల డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో ఉన్నతాధికారులు, 2020 ఫిబ్రవరి 18 న శశికుమార్‌ను ఉద్యోగం నుంచి నుంచి సస్పెండ్ చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ మరుసటి రోజే అనగా 2020 ఫిబ్రవరి 19 న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య కావాలనే తనను ఇబ్బంది పెట్టడానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న శశికుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఏమన్నదంటే... ఈ సందర్భంగా కేసు విచారిస్తున్న క్రమంలో హైకోర్టు జస్టిస్ వైద్యనాథన్.. ‘‘ఈ కేసు ఎలా కనిపిస్తోందంటే.. విడాకులు వచ్చాక భర్తను హింసించడం కుదరదని.. ఆలోపే అతడిని మరింతగా ఇబ్బంది పెట్టాలని ఆమె గృహ హింస కేసు పెట్టినట్లు కనిపిస్తోందని’’ అన్నారు. వివాహ బందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లి బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ప్రతీ భార్యా భర్తలకు ఉంది. అహం,అసహనం అనేవి… మనం ధరించే చెప్పుల లాంటివి. వాటిని ఇంటి బయటే వదిలేయాలి తప్ప లోపలికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే… భార్యాభర్తలతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా నాశనమయ్యే అవకాశముంది కాబట్టి సమన్వయం అనేది ఇద్దరికీ అవసరమని’’ సూచించారు. కాగా.. 2015లో సాలెం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని లెక్కలోకి తీసుకున్న హైకోర్టు ఆయన్ని శాఖ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిన పనిలేదనీ… మరో 15 రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసు ఆధారంగా పోలీసులు డాక్టర్ శశికుమార్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో అయన శాఖాపరంగా సస్పెండ్ అయ్యారని జస్టిస్ వైద్యనాథన్ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! -
ప్రముఖ నటుడు రాజన్ పి దేవ్ కొడుకు అరెస్ట్
తిరువనంతపురం: దక్షిణాది నటుడు, దివంగత రాజన్ పి దేవ్ కొడుకు ఉన్ని రాజన్ అరెస్టయ్యాడు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అతన్ని చాలారోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్ రావడంతో నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు ఎదురు చూశారు. కాగా, ఉన్నిరాజన్ కూడా నటుడే. కమెడియన్‌గా, విలన్‌గా దాదాపు ముప్ఫైదాకా మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంకకు వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రియాంకను భర్త ఉన్ని ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తోంది. అంతేకాదు ఓరోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితుడే. 200 సినిమాలకు పైనే నటించిన రాజన్ పి దేవ్.. 2009లో లివర్ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది. -
పెళ్లై ఏడాది కాకముందే.. వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగానే జీవించారు. కానీ మొదటి పెళ్లి రోజు కూడా చేసుకోకముందే వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన వంగ మౌనిక(20), వంగ నాగరాజు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా వరకట్న వేధింపులు భరించలేక మౌనిక శనివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. దీంతో మౌనిక తల్లి సుజాత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. బాలిక కేకలు వేయడంతో! -
లాక్డౌన్లో గృహహింస.. ఫిర్యాదులకు వాట్సప్
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో మహిళలపై గృహహింస పెరుగుతోందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా మహిళలపై గృహహింస కేసులు పెరుగాయని జాతీయ మహిళా కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. దీనితో పాటు లాక్డౌన్ సమయంలో సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో గృహహింసపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దృష్టిపెట్టారు. లాక్డౌన్ సమయంలో మహిళల ఇబ్బందులకు గురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీని కోసం వాట్సప్ నెంబర్లను సైతం ఆమె ప్రజలకు అందుబాటులో ఉంచారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. లాక్డౌన్, కరోనా పరిస్థితులను మహిళలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా ఎదుర్కోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మహిళలు మానసికంగా కుంగిపోకుండా కుటుంబసభ్యులు అండగా ఉండాలన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హెల్ప్ డెస్క్‌కి సమాచారం ఇవ్వండని తెలిపారు. వాట్సాప్‌కు మెసెజ్ వచ్చిన వెంటనే స్పందిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అందుబాటులో హెల్ప్ డెస్క్ నెంబర్లు.. 9701056808 ,9603914511 ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ : 6301411137 -
గృహహింసపై గళం విప్పిన విరుష్క జోడి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. దాదాపు నెల నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని కొంతవరకూ మెరుగు పరుస్తున్నా, గృహహింస కూడా అధికమైపోయింది. మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ గృహహింసకు గురవుతున్నామని 239 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళ కమిషన్(ఎన్సీడబ్ల్యూ) వెల్లడించడంతో మహిళలను కాపాడేందుకు 50కి పైగా హెల్ప్లైన్లు ఏర్పాటు చేసిన్టుల ఎన్సీడబ్యూ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో గృహహింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.(మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!) విరాట్-అనుష్కల వీడియో సందేశం గృహహింసపై విరుష్క జోడి ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో ఎవరైనా గృహహింసకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక వీడియో మెస్సేజ్ ఇచ్చాడు. ఈ వీడియోలో విరుష్క జోడినే కాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్,ఫరాన్ అక్తర్, కరణ్ జోహార్, దియా మీర్జా తదితరులు ఉన్నారు. వీరి సందేశం ఒకటే.. లాక్డౌన్ కారణంగా ఎవరైనా గృహహింసకు పాల్పడితే వెంటనే రిపోర్ట్ చేయమని విన్నవించారు. గృహహింస బాధితులుగా ఉండిపోవద్దని, పోలీసు ఫిర్యాదుతో ఆ సమస్యకు చెక్ పెట్టమని వీరు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram If you have been a victim, witness or a survivor of the domestic violence, please report. 🙏🏼 #LockdownOnDomesticViolence #Dial100 @cmomaharashtra_ #DGPMaharashtra @adityathackeray @aksharacentreindia A post shared by Virat Kohli (@virat.kohli) on Apr 19, 2020 at 6:02am PDT -
నట్టింట్లో కరోనా చిచ్చు
కరోనా ప్రభావం మనిషి మనుగడ అన్ని పార్శా్వల మీదా కనిపిస్తోంది. కొంచెం అజాగ్ర త్తయినా... ప్రాణాల మీదికే వస్తుందన్న నిజం ఇప్పటికే చాలా మందికి తెలిసొచ్చింది. ప్రస్తుత ఇబ్బందులే కాకుండా మున్ముందు ఇంకే ఆర్థిక విపరిణామాలు రానున్నాయో అనే బెంగ వెన్నాడుతోంది. మానవ సంబం ధాల్నీ కరోనా రకరకాలుగా ప్రభావితం చేస్తోంది. నిర్బంధ మూసివేత (లాక్డౌన్) వల్ల బయట తిరగడాలపై ఆంక్షలు, మనుషుల మధ్య భౌతిక దూరం అత్యధికుల్ని ఇళ్లకే పరిమితం చేసింది. వారాల తరబడి కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని మెరుగుపరుస్తుందనేది ఒక భావన! ఇలా కొంత మేర జరుగుతున్నా, ఇందుకు భిన్నంగా కరోనా కాలంలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మానవ సంబంధాలు చెడిన తీరుని, కొన్ని కుటుంబాల్లో సౌహార్దత కరువౌతున్న వైనాన్ని కరోనా నిర్బంధం ఎత్తిచూపుతోంది. ఇలా చెప్పడాన్ని ఎవరైనా అతిశయోక్తిగా భావించ వచ్చు! అందుకు కారణాలున్నాయి. మన సమాజంలో గృహహింస నొక పెద్ద అంశంగానే పరిగణించని కాఠిన్యభావజాలం ఇందుకొక కారణం! మౌనంగా హింసను భరించే వారు కూడా దాన్నొక నేరంగా పరిగణించని అవగాహనాలేమి మరోకారణం. కానీ, పరిస్థితులు కాస్త గంభీరంగానే ఉన్నాయని అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి (యూఎన్) గుర్తించాయి. స్థూలంగా ఏ హింసయినా, ముఖ్యంగా గృహహింస మనిషి ప్రవృత్తి, ప్రవర్తనకు సంబంధించిన అంశమే! దాన్ని కరోనా నిర్బంధ సమయం బాగా ప్రభావితం చేస్తోంది. దీన్ని పాలకులు, నిఘా–నియంత్రణ వ్యవస్థలు గుర్తించి, పట్టించుకోవా ల్సిన అవసరముంది. దీన్ని ఇలాగే అనుమతిస్తే, అత్యంత ప్రమాదక రంగా పరిణస్తుంది. ‘హింస యుద్ధభూమికే పరిమితం కాలేదు, నట్టిం టికీ విస్తరించింది. మహిళలు, పిల్లలు ఎక్కడ సురక్షితం అనుకుం టామో, ఆ ఇళ్లే వారికి ప్రమాదకరంగా మారుతున్నాయి’ అని ఐక్య రాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేపడుతున్న మీమీ పోరా టాల్లో మహిళా రక్షణ వ్యూహాన్నీ పొందు పరచండి’ అంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఇది అంతటా ఉంది ఈ జాడ్యం మనకే పరిమితమైంది కాదు. చైనా నుంచి ఐరోపా దేశాలు, అమెరికా వరకూ విస్తరించింది. అందుకే యూఎన్ మహిళా విభాగం ప్రస్తుత కరోనా కాలంలో దీన్ని ‘షాడో పాండమిక్’గా పేర్కొంటూ, కట్టడికి తగినంత ముందే హెచ్చరించింది. ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర అభివృద్ధి సమాజాల్లో క్రిస్టమస్ వంటి పండుగలు, థాంక్స్ గీవింగ్ సంబరాల్లో, సెలవుదినాల్లోనూ గృహహింస, వేధింపులుంటా యని, కరోనా నిర్బంధ దినాల్లో ఇది కాస్త ఎక్కువ మోతాదుల్లో ఉందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. కరోనా కరుకు నీడలో ఫ్రాన్స్‌లో 33 శాతం, ఆస్ట్రేలియాలో 75 శాతం గృహహింస కేసులు పెరిగాయి. భారత్‌లో గృహహింస కేసులు నమోదయ్యేదే తక్కువ! ఎక్కువ సందర్బాల్లో కనీసం బయటకు చెప్పుకోకుండా, మౌనంగానే హింసని మహిళలు, పిల్లలు భరిస్తుంటారు. హింస భరించడం కన్నా తీవ్రమైన ప్రమాదం నోరిప్పడం వల్ల ముంచుకువస్తుందన్న భయమే వారి మౌనానికి కారణం! రకరకాల హింసను మౌనంగా వారెదుర్కొం టుంటారు. గౌరవంగా బతికే వారి హక్కుకు భంగం కలిగించే సంద ర్భాలకు అసలు లెక్కేలేదు. తప్పని దారుణ స్థితులెదురైనపుడే కాపాడ మని స్థానిక పోలీసులకో, హక్కుల సంఘాలకో వారు వినతి చేస్తారు. కొంచెం అవగాహన ఎక్కువున్న వారు జాతీయ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేస్తారు. మిగతా సమయంతో పోలిస్తే కరోనా కాలంలో ఇటువంటి ఫిర్యాదులు రెట్టింపయ్యాయని సదరు కమిషన్ ప్రకటిం చింది. మూసివేత ప్రకటించాక, మార్చి 24–ఏప్రిల్ 1 మధ్య కాలం, తొమ్మిది రోజుల్లో 257 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువు న్నాయి. తదుపరి వారం (ఏప్రిల్ 2–8) మరో 116 కేసులు నమోదయ్యాయి. ‘కరోనా విపత్తుకు ముందు, హింస–వేధిం పులకు గురయ్యే మహిళలు ఫిర్యాదు చేసుకునేందుకు ఎన్నో మార్గా లుండేవి, పోస్టుకార్డు పంపేవారు, నేరుగా కమిషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారు, ఇప్పుడు వారి అవకాశాలు కూడా తగ్గిపోయాయి, మెయిల్, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్... ఈ మూడు పద్ధతుల్లోనే ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నార’ని మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇంటిగుట్టు బయటపెట్టి నట్టవుతుందని ఫిర్యాదుకు వెనకాడే రోజుల్లోనే రెట్టింపు కేసులు ఆందో ళన కలిగించే అంశమని హక్కుల కార్యకర్తలంటున్నారు. తీవ్రత గుర్తిస్తేనే .... మహిళలపైన, పిల్లలపైనా ఇపుడు జరుగుతున్న గృహహింసలో వేధిం పులకు పాల్పడే వారిది సుదీర్ఘ నేర చరిత్ర, దృఢమైన నేరప్రవృత్తి కానవసరం లేదు. తాత్కాలిక ఉద్రేకం, ఉన్మాదం అయ్యుండొచ్చు. చిత్త చాంచల్యం కావచ్చు. అత్యధిక సందర్భాల్లో పరిస్థితుల వల్ల తలె త్తిందీ కావచ్చు! కరోనా వల్ల ఇప్పుడు ఎదురైన నిర్బంధ మూసివేత ఒక ప్రభావకమే! చేతిలో డబ్బు లేకపోవడం, మద్యం అలవాటున్న వారికది దొరక్కపోవడం, ఉపాధి–ఉద్యోగ అనిశ్చితి, భవిష్యత్తుపై ఆందోళన... వెరసి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో భార్య, పిల్లలపై ఆ కోపాన్ని చూపించడం కూడా గృహహింసకు కారణమే! భార్యా పిల్లలు బయట పనులకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి తెచ్చే వారై, ప్రస్తుత మూసివేత వల్ల ఇంటికే పరిమితమవడం కొందరు వేధింపుదా రుల్ని ఉద్రేకపరిచేదే! ఏమీ చేయలేని అశక్తత, ఒత్తిడి వారిలో ఆందో ళనకరమైన మానసిక స్థితికి దారితీసే ఆస్కారముంటుంది. ఈ పరి స్థితుల్లో 24 గంటలు ఎదురెదురుగా ఉండటం, తాను బయటకు వెళ్లి సరకులు తే(లే)కపోయినా, అన్ని వేళలా కోరిందల్లా సమకూర్చమని భార్యనో, కోడలినో బలవంత పెట్టడం వంటివి కొన్ని కుటుంబాల్లో వివాదాలకు కారణమౌతున్నాయి. పరస్పర అనుమానాలు, అపో హలు కూడా రోజుల తరబడి ఇంటికే పరిమితమయ్యే ఈ నిర్బంధ కాలంలో మరింత పెరిగేవే! పిల్లలు–తల్లిదండ్రుల మధ్య చాలా దైనం దిన విషయాల్లో పొసగకపోవడం వారి మధ్య అపార్థాలకు, పరస్పర అవగాహనాలోపాలకు కారణమవుతోంది. ఫోన్ వాడకం నుంచి, డ్రెస్‌ల ఎంపిక వరకు వివాదాలకు, ఆవేశకావేశాలకూ దారితీసే పరిస్థి తులుంటాయి. యుక్తవయసు పిల్లలకు కొన్నిసార్లు తాగుబోతులు, ఉన్మాదులైన తండ్రుల నుంచే కాక తాత, మామ, చిన్నాన్న, వరుస సోదరులు వంటి కుటుంబ ఇతర సభ్యుల నుంచీ లైంగిక వేధింపు లుంటాయి. ఈ నిర్బంధ సమయాల్లో అవి పెరిగే ఆస్కారముంది. తమకు రక్షణ కావాలని కోరుతూ ఈ నిర్బంధ కాలంలోనే ‘చైల్డ్‌లైన్ ఇండియా’కు 92,000 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి ఊహిం చవచ్చు! 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు పిల్లలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసే వెçసులుబాటు కల్పించాలని కోరుతూ ప్రధానికి బాలల హక్కుల సంఘాలు ఇటీవలే లేఖ రాశాయి. ముందు ప్రభుత్వాలు మానసిక రుగ్మతల్ని తగిన ముందస్తు చర్యలతో పరిష్కరించే శాస్త్రీయ పంథాను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. నిర్బంధకాలంలో హోట ళ్లన్నీ ఖాళీగా ఉన్నాయని, గృహహింసకు గురయ్యేవారు నిర్భయంగా చెప్పండి ఆయా హోటళ్లలో వసతి కల్పిస్తాం, బాధ్యులపై చర్య తీసు కుంటామని ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన ప్రకటన మనకు స్ఫూర్తి కావాలి. అరికట్టలేనిదేం కాదు! మొదటి, రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో మనుషులు రకర కాల మానసిక రుగ్మతలకు గురయ్యారు. ఏళ్ల తరబడి అందులో మగ్గి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకున్నారు. యుద్ధం ముగిశాక కూడా బాంబుల మోత చెవుల్లో మారుమోగి నిద్రపట్టని రాత్రులు గడిపారు. ఇలా రకరకాలుగా ప్రభావితులైన వారి కుటుంబాలు తీవ్రంగా కలత చెందాయి. ఆయా సమస్యలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, పరి ష్కార శిబిరాలూ వెలిశాయి. అది కొన్ని దేశాలకు, ప్రాంతాలకే పరి మితమైన సమస్య! కానీ, ప్రస్తుత మహమ్మారి 200 పైచిలుకు భూభాగాల్ని తడిమింది. ఎక్కువ దేశాల్లో విధ్వంసమే సృష్టించింది. ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఉత్పత్తి రంగాన్ని ఛిద్రం చేసింది. ఉద్యోగ–ఉపాధిరంగం కుదేలయింది. అన్ని ప్రయత్నాలు ఫలించి రేపు మనమీ ఉపద్రవం నుంచి బయటపడ్డా... తర్వాత ఎన్నెన్ని విపరిణామాలెదుర్కోవాల్సి వస్తుందో! ఎవరి మానసిక పరి స్థితి ఎలా ఉంటుందో? ఆర్థిక నేరాలతో పాటు శారీరక హింస పెచ్చుమీరే ప్రమాదముంది. మూసివేత ఎత్తివేసిన తర్వాత... ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, కుటుంబ మద్దతు లేని మహిళలు, విధవ రాండ్రు, పిల్లలు... ఎటువంటి విపరీతాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో! అందుకే, ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. గృహహింస, లైంగికవేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించాలి. ప్రమాద ఆస్కార పరిస్థితుల్ని అంచనా వేయాలి. సైకి యాట్రిస్టుల సేవల్ని వినియోగించుకొని టెలిఫోన్ కౌన్సిలింగ్ జరిపిం చాలి. ఉద్యోగాలు పోయి, ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని, మానసికంగా కృంగిపోయిన వారిని అనునయించాలి. కరోనా సోకిందే మోననే భయంలో ఉన్నవారికి, సోకి చికిత్స పొందుతున్న వారికి... ఇలా ప్రభావితులైన వారికి కౌన్సిలింగ్ ద్వారా భవిష్యత్తుపై ఆశావహ పరిస్థితి కల్పించాలి. వివిధ సామాజిక మాధ్యమ వేదికల్ని వాడుతూ భౌతిక దూరం పాటించమని, ఇళ్లు దాటి రావద్దని అవగాహన కల్పిస్తున్న తరహాలోనే ఈ మానసిక చికిత్సకు పూనుకోవాలి. కోరు కున్న వారికే ప్రస్తుతం లభిస్తున్న ఈ సేవల్ని విస్తృత పరచాలి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సినిమారంగం, కవులు కళాకారులు, ప్రసారమాధ్యమాలు పెద్ద ఎత్తున ముందుకు రావాలి. మహిళల శ్రమని ఇప్పుడైనా గుర్తించాలని, వారిని గౌరవించాలని మంచి సందేశాలిప్పించాలి. గృహహింసకు చరమగీతం పాడి, ఇంటిని దేవాలయం చేయాలి. దిలీప్ రెడ్డి -
కట్నం తేకుంటే చచ్చిపో..
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. దీంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఎస్సై విజయ్‌కుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన ఆముదాల ప్రసూణ(మహాతి) (21)కు వెల్గటూర్ మండలం స్తంభంపెలి్లకి చెందిన తర్ర రాకేష్‌తో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.11లక్షల నగదు తోపాటు, రూ.4లక్షల బంగారు ఆభరణాలు, మరో రూ.2లక్షల సామగ్రిని కట్నంగా అందించారు. ఆ తరువాత అదనంగా మరో ఐదు లక్షలు కట్నం తేవాలని భర్త, అత్త, మామ, ఆడబిడ్డ మానసికంగా, శారీరకంగా వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పింది. ఒప్పుకున్నకాడికి కట్నం ఇచ్చానని, అదనపు కట్నం ఇవ్వలేదనని బాధితురాలి తండ్రి చెప్పాడు. 2018లో ప్రసూణకు ఆడపాప జన్మించింది. అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం తేవాలని, లేకుంటే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. గదిలో బందించి దాడి చేశారు. విషయం తండ్రికి ఫోన్‌చేసి చెప్పడంతో 15రోజుల క్రితం తండ్రి తన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. అయినా రాకేష్ పదేపదే ఫోన్‌చేసి కట్నం తీసుకురాకుంటే చచ్చిపో అని అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఈ నెల 8న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మళ్లీ కరీంనగర్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందింది. దీంతో చిన్నారి పాప అనాథగా మారింది. తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రసూణ మృతదేహం.. -
అరెస్ట్ వారెంట్.. షమీ బెయిల్ ప్రయత్నాలు
న్యూఢిల్లీ : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పై కోల్‌కతాలోని అలిఫోర్ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్ టూర్ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న షమీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. సెప్టెంబర్ 12న షమీ భారత్‌కు తిరిగి రానున్నాడని, అంతవరకు తన లాయర్ సలీమ్ రెహమాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని బోర్డు సభ్యుల్లో ఒక అధికారికి తెలిపినట్లు సమాచారం అందించాడు. కోర్టు షమీపై వేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు బీసీసీఐ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోదని" వెల్లడించారు. మహ్మద్ షమీ తనను వేదిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో గతేడాది కొద్ది రోజుల పాటు బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం షమీ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం షమీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ సందర్భంగా షమీ భార్య హసీన్ జహాన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాక్ష్యాలన్నీ తనకూ అనుకూలంగా ఉన్నాయని, ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ షమీ తప్పించుకోలేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
భర్త చేతిలో నటి దారుణహత్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మహిళా ఆర్టిస్టులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో నటి-సింగర్ భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ దారుణం పాక్‌లోని ఖైబర్ ఫంక్తుఖ్వాలో చోటుచేసుకుంది. నటి రేష్మ పలు సినిమాల్లో నటించారు. గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ ఉదంతం(దాడి) కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్ సంబల్ ఓ ప్రైవేట్ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. -
భార్యపై టీడీపీ నేత దారుణంగా చిత్రహింసలు
-
కృష్ణా జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం
-
టీడీపీ నేత బాగోతాన్ని బయటపెట్టిన భార్య
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదట. తాజాగా మరోసారి ఫిర్యాదు చేసిన ఆమె ప్రయోజనం లేదని భావించారు. పోలీసులు తనకు న్యాయం చేయరని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెలుగింటి ఆడపడుచుకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పోస్టులో ఏం పేర్కొన్నారంటే.. నాపేరు హరిణికుమారి. తెలప్రోలు గ్రామ సర్పించ్‌ని(టీడీపీ). నా భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యూత్ లీడర్. గతేడాది నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనిపై గతేడాది గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని తన ఫేస్బుక్ పోస్ట్‌లో బాధితురాలు హరిణికుమారి కోరారు. చెత్త రాజకీయ నాయకుడ్ని మీరు సమర్థిస్తారా? ‘టీడీపీ యూత్ లీడర్ ఓ బుకీ, పేకాటరాయుడు, అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇలాంటి రాజకీయనాయకుల వల్ల మాకు పోలీస్స్టేషన్లలో కూడా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ పోస్టును షేర్ చేయండి. బాధితురాలు మీ సోదరి’ అని హరిణికుమారి మరో పోస్ట్‌లో భర్త వ్యసనాలు, దురలవాట్లను బయటపెట్టారు. భర్త ఫొటోను షేర్ చేస్తూ కనబడటం లేదని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలని బాధిత మహిళా సర్పంచ్ కోరారు. ఫేస్బుక్లో మహిళా సర్పంచ్ హరిణికుమారి పోస్టులు -
కడతేర్చిన కలహాలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) / అగనంపూడి(గాజువాక) : తాళి కట్టినప్పటి నుంచీ భర్త నుంచి వేధింపులే. కుటుంబ పోషణకు చాలీచాలని డబ్బులు ఇవ్వడం... గట్టిగా అడిగితే కొట్టడం... ఈ వేధింపులు ఏడేళ్లుగా భరించిన ఆ మాతృమూర్తి ఇక తనవల్ల కాదంటూ బలవంతంగా తనువు చాలించింది. తను లేని లోకంలో బిడ్డలు ఏమైపోతారో అన్న బాధతో వారినీ వెంట తీసుకెళ్లిపోవాలనుకుంది. ఈ క్రమంలో కుమారుడు అమ్మ వెంటే అందని లోకాలకు వెళ్లిపోగా... గాయాలతో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారకర దుర్ఘటన యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం సంభవించింది. భార్యాభర్తల మధ్య కలహాలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సమీప పరసపాడుకు చెందిన ఇందిరకు పార్వతీపురం సమీపంలోని వెంకంపేటకు చెందిన కోరంగి చంద్రశేఖర్‌తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. అనంతరం వీరు బతుకుదెరువు కోసం విశాఖ శివారు వడ్లపూడి కణితి నిర్వాసిత కాలనీకి వలస వచ్చారు. భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఇందిర టైలరింగ్ పనిచేస్తూ చేదోడుగా ఉండేది. అయినప్పటికీ భార్యను చంద్రశేఖర్ నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ పోషణకు కూడా సరిపడా డబ్బులు ఇచ్చేవాడుకాదు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కుటుంబ పెద్దలు సర్ది చెబుతుండేవారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట కూడా భార్యను చంద్రశేఖర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇందిర తండ్రి శ్రీనివాసరావు వచ్చి అల్లుడిని మందలించి వెళ్లిపోయాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోగా బుధవారం మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందిర తన ఆరేళ్ల కుమార్తె జ్యోత్స్న, నాలుగేళ్ల కుమారుడు బద్రినాథ్‌ను తీసుకుని బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రానికి తల్లీ కుమారుడు విగతజీవులుగా మారారు. తల్లీ తమ్ముడి మృతదేహాల వద్ద ఏడుస్తూ... బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చేపల వేట ముగించుకుని వస్తున్న మత్స్యకారులు యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్య పొలంబొట్టపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు. తల్లి, తమ్ముడి మృతదేహాల పక్కన చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తుండడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని గోపాలపట్నం పోలీసులకు సమాచారం అంచారు. సీఐ పైడియ్యతో పాటు ఎస్ఐ తమ్మినాయుడు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలిలో లభించిన ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వడ్లపూడి వాసులుగా గుర్తించి దువ్వాడ రైల్వే పోలీసులకు, వడ్లపూడి పోలీస్ స్టేషన్‌కూ సమాచారం అందించారు. అయితే అప్పటికే తన భార్య కనిపించడం లేదని చంద్రశేఖర్ వడ్లపూడి పోలీసులను ఆశ్రయించడంతో విషయం తెలియజేసి గోపాలపట్నం రప్పించారు. చంద్రశేఖర్‌ను ఏసీపీ అర్జున్, సీఐ పైడియ్య, ఎస్ఐ తమ్మినాయుడు విచారించారు. సంఘటన ఎలా జరిగిందో తెలియదని, బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం 11 గంటల నుంచి కనిపించలేదని చెప్పాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. -
భార్యను కలవనివ్వడం లేదని...
సాక్షి, న్యూఢిల్లీ : పుట్టింటికి వెళ్లిన భార్యను కలవనీయకుండా అడ్డుపడుతున్నాడనే నేపంతో పిల్లనిచ్చిన మామనే కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు ఢిల్లీకి చెందిన నీరజ్ (27) ప్రైవేట్ ట్రావేల్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2016లో రాఖీ (25)తో వివాహం అయ్యింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో 2018, మార్చ్‌లో రాఖీ తన భర్త మీద గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి రాఖీ శశిగార్డెన్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో నీరజ్ భార్యను తిరిగి కాపురానికి రావాల్సిందిగా కోరాడు. కానీ రాఖీ అందుకు నిరాకరించడంతో నీరజ్ బెదిరింపులకు దిగాడు. ఆదివారం నీరజ్ తన భార్యను కలవడానికి ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఆ సమయంలో నీరజ్ మామ ప్రభు దయాల్ (45) తలుపు తీసి, నీరజ్‌ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుని అతనితో గొడవ పడ్డాడు. సహనం కోల్పోయిన నీరజ్ తనతో పాటు తీసుకు వచ్చిన కత్తితో మామ ప్రభు దయాల్‌ను విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రభు దయాల్‌ను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నీరజ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ సింగ్ తెలిపారు. -
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
-
ఆ ఆరోపణలపై విచారణ చేపట్టండి: షమీ
సాక్షి, స్పోర్ట్స్ : తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ డిమాండ్ చేశాడు. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్ జహాన్ ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. షమీ వివాహేతర సంబంధాలను హసిన్ జహాన్ సోషల్ మీడియాలో బయటపెట్టడం దగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రోజు రోజుకో ఓ మలుపు తిరుగుతోంది. చివరకు శుక్రవారం ఆమె కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రసవత్తరంగా మారింది. గృహ హింస చట్టం ,అత్యాచార యత్నం, వేధింపులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఈ క్రికెటర్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే హసిన్ రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్నారు. తన సోదరుడితో శృంగారంలో పాల్గొనాలని షమీ తనపై ఒత్తిడి తెచ్చేవాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైన అనంతరం మీడియాకు దూరంగా ఉన్న షమీ తాజాగా ఎఎన్ఐతో మాట్లాడారు. -
నాలుగు 'గోడు'లు
నాలుగు గోడల మధ్య ఉండాల్సినవి నాలుగు గోడల మధ్యే ఉండాలని ఆడపిల్లకు చెప్పి మరీ మెట్టినింటికి పంపిస్తారు. అందుకేనేమో ఆడపిల్ల నాలుగు గోడలకే అన్ని గోడులు చెప్పుకుంటుంది. ఇది మారాలి అంటున్నారు నదియా. గృహ హింస కొందరి ఆడవాళ్లకు ‘జీవన్మరణ సమస్య’. మీరు ఇలాంటి సంఘటనలను స్వయంగా చూశారా? చూడలేదు కానీ విన్నాను. నిజానికి ఇంట్లో ఇలాంటి హింస జరుగుతోందంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేం. కొన్నిసార్లు అమ్మాయి చెప్పినదానికన్నా ఎక్కువ హింస∙జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు తక్కువ జరిగి ఉండొచ్చు. తక్కువ.. ఎక్కువ అని కాదు కానీ ‘డొమెస్టిక్ వయొలెన్స్’ అంటేనే క్షమించరాని నేరం. నాలుగు గోడల మధ్య అమ్మాయిని బంధించి, నిస్సహాయురాలిని చేసి, ఆమె జీవితంతో ఆడుకోవడం సరి కాదు. ఇలాంటివాటిని ఎదుర్కోవాలంటే ఆడవాళ్లు ఏం చేయాలి? అమ్మాయిలు ఏం చేయాలనే విషయం చెప్పేముందు తల్లిదండ్రుల గురించి మాట్లాడాలి. ‘ఏదైనా జరిగితే ఎవరో వస్తారు.. హెల్ప్ చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకుండా నీ అంతట నువ్వు సమస్యను ఎదుర్కోవాలి’ అని చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచాలి. అప్పుడే వాళ్లల్లో ధైర్యం పెరుగుతుంది. పోనీ పేరెంట్స్ నేర్పించలేదనుకోండి.. సమాజాన్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి. ఓ సమస్యను ఇతరులు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలి. భరిస్తూ ఉంటే బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. అంటే.. ఆ బంధాన్ని వదిలించేసుకోవాలంటారా? అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పుదోవ పట్టించను. ‘కాంప్రమైజ్’ అవ్వాలి. అయితే అది ఎంతవరకు? అన్నది ముఖ్యం. ఎందుకంటే ఒక బంధం ఏర్పడటం చాలా కష్టం. అంత ఈజీగా ఆ బంధాన్ని తెంచేసుకోకూడదు. అందుకే రాజీపడాలన్నాను. అయితే రాజీపడినా లాభం లేదనుకున్నప్పుడు ఆ బంధం నుంచి బయటపడిపోవాలి. బాధపడుతూ అక్కడే ఉండటంలో అర్థం లేదు. భార్యను భర్త వేధించడం మాత్రమే కాదు.. తండ్రికి ఇచ్చిన గౌరవం పిల్లలు తల్లికి ఇవ్వకపోవడం కూడా గృహ హింసకు దారి తీస్తుందా? ఎగ్జాట్లీ. తండ్రికి ఇచ్చే విలువ తల్లికి ఇవ్వని పిల్లలను నేనూ చూశాను. పిల్లలు అలా ప్రవర్తించడానికి తండ్రే కారణం. ‘ఆ.. మీ అమ్మకేం తెలుసు? వంట తప్ప’ అని తండ్రి అనే మాటలు పిల్లలకు తల్లిపట్ల చిన్న చూపు కలిగేలా చేస్తాయి. అలాగే పిల్లల కళ్ల ముందే భార్యను భర్త కొడితే ఆ పిల్లలకు తల్లంటే ఏం గౌరవం ఉంటుంది? భార్య మాటలకు భర్త గౌరవం ఇస్తే అప్పుడు పిల్లలు కూడా తల్లిని గౌరవిస్తారు. అప్పుడే కుటుంబం కూడా బాగుంటుంది. అక్కడ పిల్లలను తిట్టినా కేసు అవుతుంది గృహ హింసకు గురవుతున్న స్త్రీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. అయితే మన దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు రావడానికి కారణం మన పాపులేషన్ ఎక్కువ. శిక్షలు పడటం తక్కువ. అదే విదేశాల్లో అయితే కారణం లేకుండా పిల్లలను తిట్టినా కేసు అవుతుంది. ఇక్కడైతే ‘హింస భరించలేకపోతున్నాను’ అంటూ స్త్రీ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునేవాళ్లు తక్కువ. మీ కుటుంబం సంగతేంటి? మా ఆయన, నేను పిల్లల ముందు వాదించుకోం. అలాగే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు తను ‘సరి’ అని, నేను ‘కాదు’ అని చెప్పం. ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతుళ్లు ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళతానని పర్మిషన్ అడిగితే.. ‘ఈ టైమ్ లోపల వచ్చేయాలి’ అని నేను ఓ కండిషన్ పెడతాను. ఆయన కూడా అదే అంటారు. అలా కాకుండా ‘మీ అమ్మ మాటలకేం.. మీ ఇష్టం’ అని ఆయన అన్నారనుకోండి.. అప్పుడు పిల్లలు నా పర్మిషన్ కోసం చూడరు. తల్లి అనుమతి లేకుండా పిల్లలు బయటికెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. పిల్లలెక్కువగా తల్లి కనుసన్నల్లోనే పెరుగుతారు. కొంతమంది ఆడవాళ్లు భర్త మీద పూర్తిగా ఆధారపడతారు.. అలాంటివాళ్లకు మీరిచ్చే సలహా? ఆడవాళ్లందరూ చదువుకోవాలి. తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదు. భర్త తెచ్చే సంపాదనతో ఇల్లు గడుపుతూ, అతను అనే సూటిపోటీ మాటలు పడకూడదు. పూర్తిగా అతని మీద ఆధారపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందరూ ఇలా ఉంటారని అనడంలేదు. నా మాటలు కటువుగా అనిపించొచ్చు కానీ భర్త ఉన్నంతవరకూ చూసుకుంటాడు. ఒకవేళ అతను చనిపోతే ఆ తర్వాత ఆ కుటుంబానికి దిక్కెవరు? పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? భార్యదే కదా. అందుకే రూపాయి సంపాదించుకోవడం తెలుసుకోవాలి. ఒకవేళ చదువుకోలేదనుకోండి ఏదో ఒక పని నేర్చుకోవాలి. అది కూడా నేర్చుకోలేని స్థితిలో ఉన్నవాళ్లను చూసి జాలిపడటం మినహా మనం ఏమీ చేయలేం. వాళ్లది నిజంగా దయనీయ స్థితి. భయపెట్టి, ఒత్తిడి చేసి కొందరు ఆడపిల్లలకు బాల్యవివాహం చేస్తున్నారు. దాని గురించి? నా ఫ్రెండ్స్ కొంతమంది టీనేజ్లోనే పెళ్లి చేసుకున్నారు. 16, 17, 18ఏళ్ల వయసులో వాళ్ల పెళ్లి జరిగింది. అయితే ఎవరూ ఒత్తిడి చేయలేదు. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవడం సరి కాదు. అసలు ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? పెళ్లి చేసుకుని భర్త, పిల్లలను చూసుకుంటూ గడిపేస్తారు. బాగున్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది. లేకపోతేనే కష్టం. అందుకే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాక పెళ్లి చేయాలి. రేపు ఏదైనా జరిగితే తట్టుకునేంత ఆత్మస్థయిర్యం అమ్మాయికి ఉండాలి కదా. ఇళ్లల్లో జరిగే బాల్య వివాహలను మనం సామాన్యులం ఆపలేం. ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ల చెయ్యి కూడా ఉంటుంది కాబట్టి.. భార్య–భర్తలిద్దర్నీ విమర్శించాలి. నాలుగు గోడల మధ్య జరిగే హింసను నలుగురి దృష్టికి తేవడానికి కొందరు ముందుకు రావడంలేదు. ఎందుకంటారు? భయం. నలుగురూ ఆడిపోసుకుంటారని. ‘ఏమో.. ఆ అమ్మాయి ఏం చేసిందో?’ అని మాట్లాడుకుంటారని. నిజానికి పరాయి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా కామెంట్ చేయకూడదు. చాలామంది అమ్మాయిలు భయపడేది ఇలాంటి కామెంట్స్‌కే. ప్లస్ చట్టపరంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండాలి. అప్పుడే ధైర్యంగా ముందుకొస్తారు. మన చట్టం ఎలా ఉందంటే... ఇవాళ అమ్మాయి ఫిర్యాదు చేస్తే స్వీకరిస్తారు. కానీ ఆ కేసు తేలడానికి ఏళ్లు పడుతుంది. ఈలోపు అబ్బాయి ఏదో ఒక రకంగా బయటికొచ్చేస్తున్నాడు. లండన్, న్యూయార్క్‌లో అలా కాదు. పేదరికం ఓ శాపం భర్త ఇంటిని పట్టించుకోకపోతే పిల్లలను పోషించుకోవడానికి ఇళ్ల పనులు చేస్తుంటారు కొందరు ఆడవాళ్లు. అన్ని ఇళ్లూ ‘సేఫ్’ అని చెప్పలేం. అలాగే ఇక్కడి ఏజెంట్స్ ద్వారా విదేశాలు వెళ్లి ఇళ్ల పనులు ఒప్పుకుంటారు. ఏ కుటుంబంలో ఇరుక్కుంటారో తెలియదు. వీళ్ల ఫేట్ బాగుంటే మంచి ఇంట్లో పడతారు. బాగాలేకపోతే అరాచక శక్తుల చేతిలో పడతారు. అది వాళ్ల బ్యాడ్ లక్. పేదరికం ఓ శాపం. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకూడదు ఎక్కడైతే సురక్షితంగా ఉండొచ్చనుకుంటామో అక్కడే (ఇంట్లో) వేధింపులు అంటే బాధపడాల్సిన విషయం. మేనమామ వేధించాడనో, బాబాయ్ వెకిలిగా ప్రవర్తించాడనో, తండ్రే దాడి చేశాడనో విన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ‘అసలు వీళ్లు మనుషులేనా?’ అనుకుంటా. పట్టరాని ఆవేశం వస్తుంది. అయితే నాది ఎందుకూ పనికి రాని ఆవేశం. ఎందుకంటే నేను స్వయంగా వెళ్లి ఏమీ చేయలేను. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఆ మగవాళ్లను వదిలిపెట్టకూడదు. కొన్నిచోట్ల ఆడవాళ్లు ఇలాంటి విషయాలను తేలికగా తీసుకుంటారు. సాటి స్త్రీని అర్థం చేసుకోలేకపోతే ఎలా? మగవాళ్లకు మనం లోకువ అయ్యేది అక్కడే. ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కాకూడదు. ఇప్పుడు చాలా టీవీ సీరియల్స్‌లో చూపిస్తున్నది అదే కదా. అత్త మీద కోడలు కుట్రలు చేయడం, తోడికోడలి మీద అసూయ, ఆడబిడ్డ కాపురాన్ని నాశనం చేయాలనుకోవడం వంటివి చూపించడం ద్వారా సమాజానికి ఏం చెబుతున్నట్లు? అవి చూసి రియల్ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నారు. పర్టిక్యులర్‌గా లండన్, నూయార్క్ గురించి చెప్పారేంటి? నా పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు అక్కడ ఉన్నాను. అక్కడ ‘లా’ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ వీక్‌గా ఉంటుంది. తప్పు చేస్తే అక్కడ తప్పించుకోవడం కష్టం. ఇంట్లో భర్త హింసపెడుతుంటే ఒక్క ఫోన్ చేస్తే చాలు నిముషాల్లో పోలీసులు ఇంటికొస్తారు. అలా ఉండాలి. అదే ఇక్కడ అయితే అంత ఫాస్ట్‌గా రియాక్షన్ ఉండదు. లీగల్ సిస్టమ్ నమ్మకం కలిగిస్తే.. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తున్నవాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగలుగుతారు. ఆడవాళ్లు చాలావరకు సున్నితహృదయులు. ‘కైండ్’గా ఉంటారు. మన ఇంట్లోవాళ్లను బయటపెట్టడమేంటి? అనుకుంటారు. ఆ ‘కైండ్‌నెస్’ని ‘వీక్నెస్’గా అర్థం చేసుకుంటున్నారు. అది బలహీనత కాదు.. మంచితనం అని అర్థం చేసుకుంటే గృహహింసలు తగ్గుతాయి. – డి.జి. భవాని -
వేధింపుల భర్తకు మూడేళ్ల జైలు
ధర్మవరం అర్బన్ : ధర్మవరానికి చెందిన అమీర్‌బాషా కుమార్తె మెహతాజ్బేగంను అదనపు కట్నం కోసం వేధించిన కేసులో ఆమె భర్త హాజీవలికి జైలు శిక్ష ఖరారైందని పోలీసులు తెలిపారు. 2005 మే 29న వీరి పెళ్లి కాగా, మూడు నెలలకే భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు అప్పట్లో స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు గృహహింస కింద హాజీవలికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ పుల్లయ్య మంగళవారం తీర్పు చెప్పారు. -
'అనుభవించానుగా.. చెప్పాలనిపిస్తోంది'
లాస్ ఎంజిల్స్: గృహహింస విషయంలో తన అభిప్రాయాలు చెప్పడం మిగితా వారికంటే తనకే ఎక్కువ బాధ్యతగా అనిపిస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటి హల్లే బెర్రి అన్నారు. ఎక్స్ మెన్ సిరీస్ చిత్రాల్లో వరుసగా నటించిన ఆమె తాను కూడా గృహహింస బాధితురాలినని చెప్పారు. తాను గతంలో లివింగ్ రిలేషన్ కొనసాగించిన ఓ బాయ్ ఫ్రెండ్‌తో తనకు ఇదే సమస్య వచ్చిందని, తాను ఎదుగుతున్న క్రమంలో తన తల్లి కూడా దీనికి బాధ్యురాలవడం చూశానని అన్నారు. 'నా తల్లి గృహహింసకు గురవడం నేను కళ్లారా చూశాను. ఆ సంఘటనలు నన్ను ఏళ్ల తరబడి వెంటాడాయి. కానీ అప్పుడు నిస్సహాయురాలిని. ఆ తర్వాత కచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒకటి చేసి నాతల్లిని విముక్తి చేయాలని అనుకున్నాను. కానీ వాస్తవంలో అలా జరగలేదు. చివరికి నేను కూడా అనుభవించాల్సి వచ్చింది. అందుకే, అవన్నీ ఇప్పటికీ నా మనసులో వెంటాడుతున్నాయి. అందుకే మహిళా లోకానికి నావంతుగా సహాయం చేయదలుచుకున్నాను. గృహహింసకు పాల్పడుతున్న వారి విషయంలో సహనంగా మాత్రం ఉండకూడదు. కొంతమంది మాత్రం ఈ విషయంలో ఎంతో సహానంతో భరిస్తుండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది' అంటూ చెప్పుకొచ్చింది ఈ ఆస్కార్ అవార్డు విజేత. -
సాయంత్రంలోపు లొంగిపో...
ఢిల్లీ: గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సాయంత్రం ఆరు గంటల్లోగా లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. 'ముందు లొంగిపోండి, తరువాత మధ్యవర్తిత్వం గురించి ఆలోచించొచ్చు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ సమాచారాన్ని సోమనాథ్ భారతి తనకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తానని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ్ భారతి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ, వివిధ ఫోన్ నంబర్లను మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. గృహహింస కేసులో తనను అరెస్ట్ చేయకుండా రక్షించాలని కోరుతూ సోమనాథ్ భారతి అంతకుముందు పెట్టుకున్న ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా సోమనాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇదివరకే సూచించారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆయన పార్టీకి అప్రతిష్ట తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా పార్టీతోపాటు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు.