తన భార్య చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ డిమాండ్ చేశాడు. ఆదివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘రోజు రోజుకి నాపై ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీటిపై మాట్లాడదలుచుకోలేదు. ఆ ఆరోపణలపై వెంటనే విచారణ చెపట్టాలని మాత్రమే కోరుతున్నాను. బీసీసీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు విచారణ అనంతరం వారే నిర్ణయం తీసుకుంటారనే విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.’ అని షమీ తెలిపాడు. ఇక భార్య హసిన్ జహాన్‌ఆరోపణలతో బీసీసీఐ వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో షమీ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.