న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. దాదాపు నెల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని కొంతవరకూ మెరుగు పరుస్తున్నా, గృహహింస కూడా అధికమైపోయింది. మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ గృహహింసకు గురవుతున్నామని 239 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళ కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) వెల్లడించడంతో మహిళలను కాపాడేందుకు 50కి పైగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన్టుల ఎన్‌సీడబ్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో గృహహింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.(మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!)
విరాట్-అనుష్కల వీడియో సందేశం
గృహహింసపై విరుష్క జోడి ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా గృహహింసకు పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక వీడియో మెస్సేజ్ ఇచ్చాడు. ఈ వీడియోలో విరుష్క జోడినే కాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్,ఫరాన్ అక్తర్, కరణ్ జోహార్, దియా మీర్జా తదితరులు ఉన్నారు. వీరి సందేశం ఒకటే.. లాక్‌డౌన్ కారణంగా ఎవరైనా గృహహింసకు పాల్పడితే వెంటనే రిపోర్ట్ చేయమని విన్నవించారు. గృహహింస బాధితులుగా ఉండిపోవద్దని, పోలీసు ఫిర్యాదుతో ఆ సమస్యకు చెక్ పెట్టమని వీరు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment