
అర్నాబ్ గోస్వామి
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాహనంపై దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని స్టూడియో నుంచి అర్నాబ్ గోస్వామి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో గణపత్రావ్ కాడమ్ మార్గ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై దూసుకొచ్చి అర్నాబ్ వాహనం అద్దంపై బాదుతూ దాడికి యత్నించారు. ఈ దాడిలో అర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. నిందితులు వారు వెంట తెచ్చుకున్న ఇంక్ బాటిల్‌ను కారుపై విసిరారు. అర్నాబ్ కారు వెనుకే వస్తున్న అతడి సిబ్బంది ఆ ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment