ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊర‌ట‌ | Supreme Court Grants Relief From Arresr To " Arnab Goswami" | Sakshi
Sakshi News home page

ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊర‌ట‌

Published Fri, Apr 24 2020 3:22 PM | Last Updated on Sat, Apr 25 2020 6:27 PM

Supreme Court Grants Relief From Arresr To Arnab Goswami - Sakshi

న్యూఢిల్లీ :  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ దాఖలైన కేసుల్లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి  ఊర‌ట ల‌భించింది. మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం మూడు వారాల్లోపు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి పెట్టుకున్న పిటిషన్ మేరకు సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గోస్వామి పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపింది. గోస్వామి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

గోస్వామిపై దాఖలైన అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై మాత్రం స్టే విధించలేదు. ప్రస్తుతం ఈ కేసును ముంబైకి బదిలీ చేశారు. కాగా ఆర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీకి పూర్తి భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టు ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్గఢ్‌లో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి సోనియా గాంధీపై గోస్వామి తన టీవీలో చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఎఫ్ఐఆర్‌లు దాఖలైన సంగతి తెలిసిందే. ​కాగా, ఆర్నాబ్‌ గోస్వామి దంపతులపై ఈనెల 22న  అర్ధరాత్రి దాడి జరిగింది. ముంబైలోని స్టూడియో నుంచి ఆర్నాబ్‌ గోస్వామి, అతని భార్య ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement