సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ కేసులు
ముంబై: సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ నౌ ఛానల్ మాజీ సంపాదకుడు, న్యూస్ అవర్ యాంకర్ ఆర్నబ్ గోస్వామి మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఎడిటర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న ఆర్నబ్ పై టైమ్స్ నౌ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది. తమ చానల్ కు సంబంధించిన సమాచార కాపీలను రిపబ్లిక్ టీవీలో మే 6, 8 తేదీలలలో అక్రమంగా వాడుకున్నారని మండిపడింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని పిలిచే బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ ఆర్నాబ్ గోస్వామిపై దొంగతనం, క్రిమినల్ ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం, బిసిసిఎల్ మేధోసంపత్తి హక్కుల వినియోగం కింద ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రిపబ్లిక్ టీవీ లాంచ్ అయిన మొదటి రోజు, ఆ తర్వాత లో తమకు సంబంధించిన కొన్ని ఫుటేజీ వాడుకున్నట్టు ఆరోపించారు. వారిద్దరూ తమ చానల్ ఉద్యోగులుగాఉన్నప్పటి సమాచారిన్నఅక్రమంగా వాడుకున్నారన్నారు. లాలు ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు షాబాబుద్దీన్ మధ్య ఉన్న ఫోన్ సంభాషణల ఆడియో టేపులను మే 6న , సునందా పుష్కర్ తో (కాంగ్రెస్ నాయకుడు శశి తారూర్ భార్య) అప్పటి తమ రిపోర్టర్‌గా ఉన్న ప్రేమా శ్రీదేవి ఫోన్ సంభాషణలను టేపులను రిపబ్లిక్ టీవీలో మే 8న వాడుకున్నారని పిర్యాదు చేసింది. ఈ రెండు ఫోన్ సంభాషణల ఆడియో టేపులను వారు ఉద్యోగం లో ఉన్నప్పటివని బీసీసీఎల్ ఆరోపించింది. గోస్వామి, శ్రీదేవి ఉద్దేశపూర్వకంగా టైమ్స్ నౌ మేధో సంపదను వాడుకోవడంపై భారత శిక్షాస్మృతిసెక్షన్ 403, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని కోరింది.
కాగా గత నవంబర్లో టైమ్స్ కు రాజీనామా అనంతరం పేరుతో కొత్త చానల్‌ను రిపబ్లిక్ పేరుతో మే 6న లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.