ముంబై : రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో అర్నాబ్ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ ఇర్ఫాన్.. అర్నాబ్‌పై ఫిర్యాదు చేశారు. అర్నాబ్, అతని చానెల్.. బాంద్రాలోని ఓ మసీద్ లక్ష్యంగా ముస్లింలపై ద్వేషం సృష్టిస్తున్నారని ఇర్ఫాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏప్రిల్ 14న వలస కూలీలు నిరసనకు బాంద్రాలోని మసీదులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. (చదవండి : అర్నాబ్‌కు పోలీసుల నోటీసులు)
‘బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు నిరసన తెలపడానికి.. అక్కడికి సమీపంలోని మసీదుకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మసీదు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వలస కూలీలు పెద్ద ఎత్తున చేరిపోయారు. కానీ అర్నాబ్ మాత్రం ఆ మసీదు.. మత ఘర్షణలకు యత్నిస్తుందని తన షోలో చెప్పారు. బాంద్రాలోని మసీదు వద్ద జనం గుమిగూడెలా చేసింది ఎవరు?. లాక్‌డౌన్ సమయంలో ప్రతి మసీదు సమీపంలో ఎందుకు జనం కనిపించారు. ఇది ముస్లింలను టార్గెట్ చేసేందుకే జరిగిన ప్రణాళిక’ అని ఇర్ఫాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. అర్నాబ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే ఆధారాల్లో భాగంగా.. ఆ షోకు సంబంధించిన క్లిప్స్ సేకరించే పనిలో ఉన్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment