ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా | Arnab Goswami Arrest : Shades Of Emergency Amit Shah Says | Sakshi
Sakshi News home page

ఆ చర్య పత్రిక స్వేచ్ఛను కాలరాయడమే : అమిత్‌షా

Published Wed, Nov 4 2020 5:27 PM | Last Updated on Wed, Nov 4 2020 7:51 PM

Arnab Goswami Arrest : Shades Of Emergency Amit Shah Says - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి

 సాక్షి, న్యూఢిల్లీ :  రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్‌ అరెస్ట్‌ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 
(చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు)

‘కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. అర్నబ్‌ గోస్వామి, రిపబ్లిక్‌ టీవీని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దాడిని వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన పత్రికపై దాడిగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని మనమందరం ఖండించాలి’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. కాగా, 2018లో డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో అర్నబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement