ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్ | Arnab Goswami farewell speech leaked | Sakshi
Sakshi News home page

ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్

Published Fri, Nov 4 2016 9:09 AM | Last Updated on Mon, Oct 1 2018 5:14 PM

ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్ - Sakshi

ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు వీడియో లీక్

న్యూఢిల్లీ: ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ 'టైమ్స్‌ నౌ' ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకున్న సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు ప్రసంగం వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోను గురువారం ఆన్ లైన్ లో పెట్టారు. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దని తన టీమ్ కు సూచించారు.

'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమంది నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్‌ షో ‘ద న్యూస్‌ అవర్‌'తో పాపులరయిన ఆర్నబ్‌ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్‌ నౌ'లో పనిచేశారు. ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement