అర్నాబ్‌ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు | Arnab arrest: Sena slams BJP comments against Maha govt     | Sakshi
Sakshi News home page

అర్నాబ్‌ వివాదం : ‘సామ్నా’ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Nov 5 2020 1:16 PM | Last Updated on Thu, Nov 5 2020 3:56 PM

Arnab arrest: Sena slams BJP comments against Maha govt     - Sakshi

సాక్షి, ముంబై: రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్‌ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది.  బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై  జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది.   (మంత్రగత్తె వేట : అర్నాబ్ న్యాయ పోరాటం)

మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ‍్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్‌లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఒక అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య న్యాయం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధిత నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని సూచించింది. అలాగే ప్రధానమంత్రితో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement