హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్ క్లబ్ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్ నారాయణ్ వెల్లడించారు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ )
దాదాపు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్ రికార్డింగ్ స్టూడియో, కాన్ఫరెన్స్ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, సబ్‌కో కాఫీ బ్రాండ్ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్ వివరించారు. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్)
Comments
Please login to add a commentAdd a comment