quorum
-
హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు
హైదరాబాద్,బిజినెస్ బ్యూరో: ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఈవెంట్ల నిర్వహణకు కూడా వేదికగా ఉపయోగపడేలా హైదరాబాద్‌లో ’డిస్ట్రిక్ట్150’ పేరిట కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు కోరమ్ క్లబ్ వెల్లడించింది. దేవ్‌భూమి రియల్టర్స్ భాగస్వామ్యంలో రూ. 16.5 కోట్ల పెట్టుబడితో దీన్ని నెలకొల్పుతున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో వివేక్ నారాయణ్ వెల్లడించారు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ ) దాదాపు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ’డిస్ట్రిక్ట్150’ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇందులో ఒపెరా తరహా హాల్, పాడ్‌కాస్ట్ రికార్డింగ్ స్టూడియో, కాన్ఫరెన్స్ రూమ్‌లు, థియేటర్, జిలా బ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, సబ్కో కాఫీ బ్రాండ్ మొదలైనవి ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో 8 పైగా ఇటువంటి వెంచర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి వెంచర్‌ను బెంగళూరులో నెలకొల్పుతున్నట్లు నారాయణ్ వివరించారు. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
కోరమ్ లేక వాయిదా
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్‌సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కోరమ్ అంటే? లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు. -
ఆర్బీఐ ఎంపీసీ సమావేశం వాయిదా
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశ తేదీలను తరువాత ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1) ఈ కీలక భేటీ జరగాల్సి ఉంది. కమిటీలో స్వతంత్ర సభ్యుల నియామకంలో జరిగిన ఆలస్యం, దీనితో సమావేశం నిర్వహణకు సంబంధించి పాల్గొనాల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరమ్) తగ్గే అవకాశాలు ఏర్పడ్డం వంటి అంశాలు ఎంపీసీ సమావేశం వాయిదాకు కారణమని తెలుస్తోంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)సహా ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం తీసుకునే కీలక సాంప్రదాయం 2016 అక్టోబర్ నుంచీ ప్రారంభమైంది. ఇందులో సగం మంది సభ్యులు బయటివారు(ఎక్స్టర్నల్). అలాగే కమిటీలో వీరు స్వతంత్ర సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల బాధ్యతల కాలం నాలుగేళ్లు. గత నెలతో వీరి పదవీకాలం ముగిసిపోయింది. అయితే కొత్తవారి నియామకం జరగలేదు. పాతవారి పునఃనియామకం అవకాశం ఉండదు. సమావేశంలో కనీసం నలుగురు సభ్యులు పాల్గొనాల్సి ఉంది. గవర్నర్ లేదా కమిటీలో సభ్యులుగా ఉన్న ఆయన డిప్యూటీ (పరపతి విధానం ఇన్చార్జ్) సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. కమిటీలో ఆర్బీఐ తరఫున సెంట్రల్ బోర్డ్ నియమించిన మరో సీనియర్ అధికా రి కూడా సభ్యులుగా ఉంటారు. బయటి నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించేందుకు ఈ ఏడాది మొదట్లో ఒక కమిటీ ఏర్పాటైంది. క్యాబినెట్ కార్యదర్శి, ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఎంపీసీ చివరి 24వ సమావేశం జరిగింది. -
కోరం లేక లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: లోక్‌సభలో శుక్రవారం కోరం లేక కార్యక్రమాలు నిలిచిపోయాయి. పదిహేను రోజులుగా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం సభలో చాలినంత సంఖ్యా బలం లేకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాయంత్రం 5.45 గంటల సమయంలో సభలో కెన్–బెట్వా అనుసంధానం, నీటి ఎద్దడి సమస్యలపై చర్చ జరుగుతుండగా ఆప్ సభ్యుడు భగ్వంత్ మాన్ కోరం లేని విషయాన్ని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షంతోపాటు అధికార పార్టీల సభ్యులు చాలామంది సభలో లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అగర్వాల్ సభా కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు కోరం బెల్ మోగించారు. మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం, అంటే కనీసం 55 మంది సభ్యులుంటే కోరం ఉన్నట్లు లెక్క. -
పార్టీ ఎంపీలపై మోదీ అసంతృప్తి
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని పార్టీ ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుచుగా తగినంతమంది బీజేపీ ఎంపీలు సభకు హాజరుకావడం లేదని, కోరం కూడా లేకపోతున్న కారణంగా సభా కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని ఆయన వారిని మందలించారు. తాను ఎప్పుడంటే అప్పుడు ఇకపై ఫోన్లు చేస్తానని, ఎవరికైనా ఫోన్ చేయవచ్చని ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు తనకు హామీ ఇవ్వాలని మోదీ వారిని అడిగారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాని, అలాంటప్పుడు కనీసం పార్లమెంటుకు హాజరై తమ వంతు పాత్ర పోషించడం ప్రతి ఎంపీ కనీస బాధ్యత అని వారికి సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో కోరం లేదని, దీని వల్ల సభ నడిపించే పరిస్థితి లేకుండా తయారైందని ప్రధాని మోదీకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెప్పిన అనంతరం మోదీ ఎంపీల తీరుపై గుర్రుమన్నారంట. సభకు హాజరుకావాలని వేరే వారితో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదని, అది వారి వ్యక్తిగత బాధ్యత అని మోదీ గుర్తు చేశారంట.