
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్‌సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన తర్వాత సభలో కోరమ్ లేదన్న విషయాన్ని అదే పార్టీ ఎంపీ దయానిధి మారన్ లేవనెత్తారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. కోరమ్ బెల్లు మోగించాలని సిబ్బందికి సూచించారు. తగిన సంఖ్యలో సభ్యులను సమీకరించడంలో ప్రభుత్వ ఫ్లోర్ మేనేజర్లు విఫలమయ్యారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
కోరమ్ అంటే?
లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉంటేనే సభను నిర్వహించాలి. అంటే కనిష్టంగా 55 మంది సభ్యులు సభలో ఉండాలి. దీన్నే కోరమ్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment