డుగ్... డుగ్.. డుగ్... శబ్దంతో రాజసం ఉట్టిపడే బైక్‌పై...అంతే రాయల్‌గా కూర్చుని రయ్యిన వెళుతుంటే... ఆ హుందానే వేరు! 'కొంత'మందికే పరిమితైన వెహికల్‌ను ధనికులు ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ అయిన ఈ బండి పల్లెటూళ్లలోనే కాదు... మహానగరాల్లోనూ క్రేజీ బైక్‌గా మారింది. అందుకే ఈ బైక్ కు మరిన్ని హంగులు యాడ్ చేసి ఆటో మొబైల్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా '2021 న్యూ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ను మార్పులు చేసి అందుబాటులోకి తేనున్నాయి.
‘రాయల్’ సిరీస్ గురించి సీరియస్‌గా ఫాలో అయ్యేవారికి ‘2021 న్యూ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ గురించి ఆసక్తి ఉంటుంది. ఈ బండి రకరకాల మార్పులతో వస్తున్నట్లు వినికిడి.
‘ఇంజన్’ ‘పవర్‌ట్రైన్’...మొదలైన ఫీచర్లను ‘మీటిమోర్ 350’ నుండి అరువు తెచ్చుకుంటుంది. కొత్త మోడల్స్‌ను తీసుకురావడంలో పేరున్న రాయల్ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొంది. రాబోయే నెలల్లో మాత్రం కొత్త మోడల్స్‌ను చూడవచ్చు అంటున్నారు.
చదవండి : ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త
Comments
Please login to add a commentAdd a comment