భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్‌లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు.
ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు.
డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా?
ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment