india army
-
టైగర్ ట్రయంఫ్ 2024: కాకినాడ బీచ్‌లో ఫీల్డ్ హాస్పిటల్
టైగర్ ట్రయంఫ్ 2024లో భాగంగా శుక్రవారం (మార్చి 29) కాకినాడ బీచ్‌లో భారత్ & అమెరికా ద్వైపాక్షిక ట్రై-సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) కార్యక్రమం జరిగింది. రెండు దేశాలకు చెందిన బృందాలు ఫీల్డ్ హాస్పిటల్ అనే ఒక ప్రత్యేక శిబిరాన్ని.. ఇల్లు వదిలిన లేదా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం నిర్మించారు. టైగర్ ట్రయంఫ్ 2024లో భారత్ నుంచి హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లతో కూడిన ఇండియన్ నేవీ షిప్‌లు, ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది మాత్రమే కాకుండా వారికి చెందిన వాహనాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్.. హెలికాప్టర్లతో పాటు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్‌లు పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నుంచి మెరైన్ కార్ప్స్, ఆర్మీకి చెందిన దళాలు, నౌకాదళ నౌకలు మాత్రమే కాకుండా నేవీ నుంచి ల్యాండింగ్ క్రాఫ్ట్, హోవర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు ఇందులో ప్రాతినిధ్యం వహించాయి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎక్సర్సైజ్లో జెన్నిఫర్ లార్సన్, కాన్సుల్ జనరల్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, రియర్ అడ్మిరల్ జోక్విన్ జే. మార్టినెజ్ డి పినిలోస్, రిజర్వ్ వైస్ కమాండర్ యూఎస్ సెవెంత్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధనకర్, ఫ్లాగ్ ఆఫీసర్ మొదలైనవారు పాల్గొన్నారు. భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న మూడవ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్.. ఇంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే పెద్దదని రియర్ అడ్మిరల్ మార్టినెజ్ పేర్కొన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి కార్యకలాపాలు వాస్తవ ప్రపంచంలో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయగల సామర్థ్యం, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. -
భారత సైన్యంలోకి బలిష్టమైన వాహనాలు - ఇవి చాలా స్పెషల్!
భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు. ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు. డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది. -
సైనిక.. సెలవిక అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ (ఫొటోలు)
-
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఉన్న కుటుంబానికి జవాన్ల సాయం.. ఆకట్టుకుంటున్న వీడియో
-
‘ఎవరీ మేజర్ బీనా తివారీ’
తుర్కియే - సిరియా భూకంప బాధితులకు అండగా నిలుస్తోన్న ఇండియన్ ఆర్మీ మేజర్ బీనా తివారీపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇది భారత్ ఇమేజ్ అంటూ తాజాగా బీనా ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తుర్కియే, సిరియాలో గతవారం సంభవించిన భారీ భూకంపంలో మృత్యువిలయం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 41వేలకు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల ఆర్తనాధాలు వినిపిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాల్ని ప్రచురించింది. ఇక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న భూకంప బాధితులకు భారత్ భరోసా ఇస్తోంది. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో మీకు మేమున్నాం’ అంటూ గడ్డకట్టే చలిలోనూ ఇండియన్ ఆర్మీ సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా భారత్ నుంచి సహాయక చర్యల కోసం అక్కడికి వెళ్లిన మేజర్ బీనా తివారీ సేవలపై స్థానికుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె తమపట్ల చూపిస్తున్న ఆత్మీయతకు తుర్కియే వాసులు కరిగిపోతున్నారు. తుర్కియే మహిళ బీనా తివారీని ప్రేమగా ముద్దాడిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆ చిత్రాలపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో భారత్ ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్ ఇమేజ్’ అని ప్రశంసించారు. ఎవరీ మేజర్ బీనా తివారీ 28 ఏళ్ల ఇండియన్ మేజర్ బీనా తివారీ తుర్కియే భూకంప బాధితురాల్ని కాపాడింది. అందుకు కృతజ్ఞతగా బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేయగా..ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన బీనా తివారీ కుటుంబ సభ్యులు మొత్తం దేశానికి సేవలందిస్తున్నారు. ఇప్పటికే బీనా తివారీ తాత కైలానంద్ తివారీ (84) కుమావ్ రెజిమెంట్ సుబేదార్‌గా సేవలందించి రిటైర్ అయ్యారు. ఆమె తండ్రి మోహన్ చంద్ర తివారీ (56) అదే రెజిమెంట్‌లో సుబేదార్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో అస్సాంలో పనిచేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి 7న తుర్కియే - సిరియా క్షతగాత్రుల్ని కాపాడేందుకు 99 మంది వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపిన విషయం తెలిసిందే. వారిలో మేజర్ బీనా తివారీ కూడా ఉన్నారు. -
చైనా సైనికుడ్ని పీఎల్ఏకు అప్పగించిన భారత సైన్యం
న్యూఢిల్లీ : అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడ్ని భారత సైన్యం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి అప్పగించింది. బుధవారం ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ వద్ద చైనా సైన్యానికి అప్పగించింది. కాగా, చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ సోమవారం తూర్పు లద్ధాఖ్లోని డెమ్చోక్ వద్ద అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో భారత సైన్యం అతడ్ని అదుపులోకి తీసుకుంది. వాంగ్ జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు ఆధారంగా చైనాలోని సెంట్రల్ జెజియాంగ్, షాంగ్జిజెన్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించింది. ( చైనా సైన్యాన్ని ఎప్పుడు తరిమేస్తారు? ) దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య సహాయం అందించాము. ఆ తర్వాత అతడినుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గూఢచర్యానికి సంబంధించిన కోణం మాకు కనిపించలేదు’’ అని తెలిపారు. తమ సైనికుడు పశువులు మేపుకునే వ్యక్తులకు సహాయం చేస్తుండగా పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించాడని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
చైనాకు దీటుగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి. కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది. భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు. భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ‘గల్వాన్ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్ సొ ప్రాంతంలోని ఫింగర్ 4, ఫింగర్ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది. -
చేత్తో విసిరే సరిహద్దు నిఘా పరికరాలు
న్యూఢిల్లీ: చేతితో విసిరితే ఎగురుకుంటూ వెళ్లి శత్రు స్థావరాల సమాచారాన్ని తెలియజేసే పది కిలోమీటర్ల రేంజ్ కలిగిన 200 ఆర్క్యూ–11 రావెన్ యూఏవీలను కొనుగోలు చేయడానికి భారత ఆర్మీ సిద్ధమైంది. వీటితో పాటు ఇజ్రాయిల్ టెక్నాలజీతో తయారైన స్పైక్ ఫైర్ ఫ్లై ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. (ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ) ఫైర్ ఫ్లై ఆయుధాలను 40 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రువులపై గురి తప్పకుండా ప్రయోగించొచ్చు. ఒక వేళ అనుకున్న టార్గెట్ ప్రాంతాన్ని మారిపోతే ఫైర్ ఫ్లై తిరిగి వెనక్కు వచ్చేస్తుంది. రావెన్ యూఏవీలు 500 అడుగుల ఎత్తులో 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. శుత్రు సైన్యంపై నిఘా కోసం వీటిని వాడతారు. సరిహద్దుల్లో గల్వాన్ వ్యాలీ లాంటి ఉదంతాలు జరిగినప్పుడు శత్రువును అంచనా వేయడానికి ఇవి పనికొస్తాయని నిపుణులు భావిస్తున్నారు. (కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!) ఈ నెలలోనే భారతీయ వాయుసేనకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ ఫైటర్ జెట్లు అందనున్నాయి. వీటిలో నాలుగింటిని పైలట్ల శిక్షణ కోసం వాడనుంది. ఈ ఏడాది చివరకు భారత నేవీ అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన ఐఎన్ఎస్ అరిఘాత్‌ను కమిషన్ చేయనుంది. లడఖ్ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలో చైనా ఆరు యుద్ధ నౌకలను పంపిందని పేరు చెప్పడానికి ఇష్టపడని నేవీ ఆఫీసర్ ఒకరు చెప్పారు. వాటిపై భారత నేవీ నిఘా పెట్టిందన్నారు. దాంతో తొలుత మూడు చైనా నౌకలు తిరిగి వెనక్కు పోయాయని, ఇటీవల మిగతావి కూడా వెళ్లాయని వెల్లడించారు. -
సలామ్ కల్నల్ సంతోష్..
సాక్షి, సూర్యాపేట: తండ్రి కలను నెరవేరుస్తూ సైన్యంలో చేరాడు... 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కల్నల్ స్థాయికి ఎదిగాడు... ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా లాక్డౌన్ వల్ల రాలేక సరిహద్దులో విధులు కొనసాగించాడు... ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. బాగున్నావా’అంటూ పలకరించాడు. కానీ అనూహ్యంగా 24 గంటలు అయినా గడవకముందే చైనా సైన్యం దాష్టీకంలో వీరమరణం పొందాడు. ఇదీ విధి నిర్వహణలో అసువులుబాసిన తెలుగుతేజం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) ప్రస్థానం. భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నేపథ్యమిదీ... భార్యాపిల్లలతో కల్నల్ సంతోష్ (ఫైల్) తండ్రి కల కోసం... సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. ఎస్బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైరైన ఉపేందర్‌కు బాల్యంలోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవడంతో ఆ కోరికను ఎలాగైనా తన కుమారుడి రూపంలో చూడాలనుకున్నారు. సంతోష్ సైతం తండ్రి కలను నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్.. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్లో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు. కుమారుడి ఫొటోను చూస్తూ కన్నీరుమున్నీరవుతున్న సంతోష్ తల్లిదండ్రులు చొరబాటుదారులను హతమార్చి దేశాన్ని కాపాడి... సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్తోగల సరిహద్దులో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు. బదిలీ అయినా రాలేక... కల్నల్ సంతోష్‌ను ఇప్పటికే హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ మరణవార్త తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రత్యేక విమానంలో హైదాబాద్‌కు పార్థివదేహం... అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో సైన్యం హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు తరలించింది. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులను సైనికాధికారులు కోరారని, కానీ సంతోష్ తల్లిదండ్రులు మాత్రం సూర్యాపేటలోనే అంత్యక్రియలు జరపాలనుకుంటున్నట్లు చెప్పారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. తల్లిగా బాధ ఉంది.. దేశ పౌరురాలిగా గర్విస్తున్నా కుమారుడి వీరమరణంపట్ల తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. కానీ దేశ పౌరురాలిగా మాత్రం గర్వంగా ఉంది. సంతోష్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ముఖ్యంగా లెక్కలు క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్‌గా చేసేవాడు. దూరప్రాంతాల్లో ఉన్నా నాతో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకొనేవాడు. సరిహద్దు వివాదాలపై టీవీల్లో వచ్చే అంశాల గురించి అడిగితే ‘అమ్మా.. టీవీల్లో వేరు, అక్కడ (సరిహద్దులో) పరిస్థితి వేరు. మీరెవరూ భయపడొద్దు’అంటూ ధైర్యం చెప్పేవాడు. చివరిసారిగా ఆదివారం ఫోన్లో మాట్లాడాడు. ఎలా ఉన్నావని అడిగాడు. – మంజుల (సంతోషతల్లి) దేశం కోసమే పంపా.. దేశానికి సేవ చేయాలనన నా కోరిక కుమారుడి రూపంలో నెరవేరింది. సంతోష్‌కు చిన్నతనం నుంచే దేశంపై బాగా మమకారం ఉండేది. నేను కలలుకన్న విధంగా సంతోష్ సైన్యంలో చేరడంతో ఆనందించా. సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడం ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తండ్రిగా చాలా బాధ కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఒక్క నిమిషమే నాతో మాట్లాడాడు. అమ్మతో మాట్లాడతాను.. ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చాను. అదే సంతోష్ చివరి మాట. – ఉపేందర్ (సంతోష్ తండ్రి) కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం సీఎం కేసీఆర్ హామీ.. కుటుంబ సభ్యులకు సానుభూతి సరిహద్దులో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ పార్థివదేహాన్ని అందుకోవడంపాటు అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్నల్ తండ్రికి హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ ఫోన్ చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ వీరమరణంపట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్‌తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్‌ను దత్తాత్రేయ ఓదార్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం కల్నల్ సంతోష్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కల్నల్ సంతోష్ మరణం విచారకరం జవాన్ల ప్రాణత్యాగం ఎప్పటికీ గుర్తుంటుంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం సాక్షి, అమరావతి: తూర్పు లఢాక్ (ఎల్ఓసీ) వద్ద చైనా దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్‌బాబు, మరో 19 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సంతోష్‌బాబు ప్రాణ త్యాగం ఎప్పటికీ గుర్తుంటుందని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికుల దీక్ష మరింత దృఢతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
నా ఒక్కగానొక్క కొడుకు: సంతోష్ తల్లి
సాక్షి, సూర్యాపేట : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ‘నా ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం తల్లిగా బాధగా ఉంది. కానీ దేశం కోసం నా కుమారుడు అమరుడైనందుకు సంతోషంగా ఉంది’ అని మంజుల పేర్కొనడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. ఇంతటి పెను విషాదంలోనూ ఆ తల్లి ఈ విధంగా మాట్లాడడం వారి దేశ భక్తిని చాటుతోంది. (చదవండి : చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి) కాగా, సంతోష్ తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉండగా.. భార్య, పిల్లలు ఢిల్లీలో ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం సాయంత్రానికి సంతోష్ బాబు భౌతికకాయాన్ని సూర్యాపేటకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి
సాక్షి, హైదరాబాద్ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. (చదవండి : సరిహద్దుల్లో తీవ్ర అలజడి) లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. హైదరబాద్‌కు బదిలీ అంతలోనే.. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. మూడు నెలల క్రితమే సంతోష్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లాక్డౌన్ కారణంగా ఆయన చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
సరిహద్దుల్లో తీవ్ర అలజడి
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సరిహద్దులో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ చెలరేగింది. గాల్వాన్‌లోయ ప్రాంతంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగింది. సరిహద్దు వివాదంలో ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. మరికొంతమంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చైనా సైనికులకూ కొందరికి గాయాలయ్యాయి. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా లదాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య గతకొంత కాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, భారత్-చైనా సరిహద్దులో కాల్పులు జరగలేదని, ఇరు సేనల మధ్య ఘర్షణ జరిగిందని భారత్ పేర్కొంది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’) ప్రభుత్వ నివేదికల ప్రకారం.. ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా అలజడి నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. చైనా దాడులను తిప్పికొట్టే విధంగా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ) -
ఒవైసీకి సైన్యం ధీటైన సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. సైనికులను తాము ఎప్పుడూ మత దృష్టితో చూడలేదని.. ఆ పని మీలాంటి వాళ్లు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించింది. మా దృష్టిలో అంతా సమానమే.. కానీ, కొందరు మాత్రం ఆ పని చేస్తున్నారంటూ పరోక్షంగా ఒవైసీకి చురకలు అంటించింది. సైన్య ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘మేం మా సైన్యాన్ని మత కోణంలో ఏనాడూ చూడం. సర్వ ధర్మ స్థల్ అనే సూత్రాన్ని పాటిస్తాం. కానీ, కొందరు నేతలు మాత్రం ఆ పని చేస్తున్నారు. అమర వీరులకు మత రంగును అద్ది లబ్ధి పొందాలని చూస్తున్నారు. భారత్ సైనికులకు మతం ఉండదనే విషయం బహుశా వారికి తెలీక పోవచ్చు. వారి దేశభక్తిని వారి విజ్ఞతతకే వదిలేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. కాగా, సంజువాన్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవానులలో ఐదుగురు ముస్లింలు ఉన్నారని అసదుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ముస్లింల జాతీయతను సోకాల్డ్ జాతీయవాదులు పదేపదే ప్రశ్నిస్తుంటారు. సంజువాన్ ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన ఏడుగురిలో ఐదుగురు కశ్మీరీ ముస్లింలు ఉన్నారు. దేశం పట్ల మాకున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించేవారందరికీ ఈ ఉదంతం కనువిప్పు కావాలి. దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నా పాకిస్తానీయులు అంటూ ముద్ర వేస్తున్నారు. దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలని ఇప్పటికీ ముస్లింలను అడుగుతున్నార’ని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేయటంతో వివాదాస్పదంగా మారింది. -
మాపై రాళ్లు, పెట్రోల్ బాంబులు వేశారు: మేజర్
శ్రీనగర్: జీపు ముందు భాగంలో ఓ యువకుడిని కట్టేయడంపై ఆర్మీ మేజర్ లీతుల్ గోగోయ్ స్పందించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోకపోవడంపై మీడియాతో మాట్లాడారు. స్ధానిక ప్రజలను కాపాడేందుకు అలా చేసినట్లు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న బూత్ దగ్గరకు వెళ్లిన తమపై 1200 మంది స్ధానికులు రాళ్లు, పెట్రోల్ బాంబులు విసరడం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో తమ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి తాము తిరిగి వారిపై కాల్పులు చేయడం లేదా ఆత్మరక్షణకు హ్యూమన్ షీల్డ్ కోసం ఒక యువకుడిని ఉపయోగించడమని చెప్పారు. ఇందులో తాము రెండో ఆప్షన్‌ను ఎంచుకుని రాళ్లు రువ్వుతున్న ఓ యువకుడిని పట్టుకుని జీపు బానెట్‌కు కట్టేసినట్లు తెలిపారు. రాళ్లు రువ్వుతున్న వారిపై కాల్పులు జరపకుండా వారి ప్రాణాలను కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడిందని వివరించారు. మేజర్ గోగోయ్‌కు ఆర్మీ స్టాఫ్‌కు అందించే ప్రెస్టెజియస్ కమన్‌డెషన్ కార్డును గత వారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అందజేసినట్లు తెలిసింది. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించిన అధికారులను కమన్‌డెషన్ కార్డును ఇస్తారు. -
జై జవాన్...!