చైనా సైనికులు (ఫైల్)
న్యూఢిల్లీ : అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడ్ని భారత సైన్యం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)కి అప్పగించింది. బుధవారం ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ వద్ద చైనా సైన్యానికి అప్పగించింది. కాగా, చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ సోమవారం తూర్పు లద్ధాఖ్‌లోని డెమ్‌చోక్ వద్ద అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో భారత సైన్యం అతడ్ని అదుపులోకి తీసుకుంది. వాంగ్ జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డు ఆధారంగా చైనాలోని సెంట్రల్ జెజియాంగ్, షాంగ్జిజెన్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించింది. ( చైనా సైన్యాన్ని ఎప్పుడు తరిమేస్తారు? )
దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య సహాయం అందించాము. ఆ తర్వాత అతడినుంచి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గూఢచర్యానికి సంబంధించిన కోణం మాకు కనిపించలేదు’’ అని తెలిపారు. తమ సైనికుడు పశువులు మేపుకునే వ్యక్తులకు సహాయం చేస్తుండగా పొరపాటున భారత సరిహద్దులోకి ప్రవేశించాడని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment