టైగర్ ట్రయంఫ్ 2024లో భాగంగా శుక్రవారం (మార్చి 29) కాకినాడ బీచ్‌లో భారత్ & అమెరికా ద్వైపాక్షిక ట్రై-సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) కార్యక్రమం జరిగింది. రెండు దేశాలకు చెందిన బృందాలు ఫీల్డ్ హాస్పిటల్ అనే ఒక ప్రత్యేక శిబిరాన్ని.. ఇల్లు వదిలిన లేదా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం నిర్మించారు.
టైగర్ ట్రయంఫ్ 2024లో భారత్ నుంచి హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లతో కూడిన ఇండియన్ నేవీ షిప్‌లు, ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది మాత్రమే కాకుండా వారికి చెందిన వాహనాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్.. హెలికాప్టర్‌లతో పాటు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్‌లు పాల్గొన్నాయి.
యునైటెడ్ స్టేట్స్ నుంచి మెరైన్ కార్ప్స్, ఆర్మీకి చెందిన దళాలు, నౌకాదళ నౌకలు మాత్రమే కాకుండా నేవీ నుంచి ల్యాండింగ్ క్రాఫ్ట్, హోవర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు ఇందులో ప్రాతినిధ్యం వహించాయి.
హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌లో జెన్నిఫర్ లార్సన్, కాన్సుల్ జనరల్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, రియర్ అడ్మిరల్ జోక్విన్ జే. మార్టినెజ్ డి పినిలోస్, రిజర్వ్ వైస్ కమాండర్ యూఎస్ సెవెంత్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధనకర్, ఫ్లాగ్ ఆఫీసర్ మొదలైనవారు పాల్గొన్నారు.
భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న మూడవ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్‌సైజ్.. ఇంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే పెద్దదని రియర్ అడ్మిరల్ మార్టినెజ్ పేర్కొన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి కార్యకలాపాలు వాస్తవ ప్రపంచంలో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయగల సామర్థ్యం, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment