
నిబంధనలకు అందరికీ వర్తిస్తాయి. అందుకు ఎవరూ అతీతులు కారు అని నిరూపించింది ఇక్కడ జరిగిన ఒక సంఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే...ఇక్కడోక పోలీసు సరైన హెల్మట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీస్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై హెల్త్ హెల్మెట్ కేసు బుక్‌చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన బెంగళూరులోని ఆర్టీ నగర్‌లో చోటు చేసుకుంది. నగర రహదారులపై ఇలా ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఇలా గేర్‌లెస్ స్కూటర్ నడుపుతున్నప్పుడూ.. ఆఫ్ హెల్మట్ ధరించడం నేరం.
ఈ మేరకు ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్‌లో... ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక పోలీస్‌పై ట్రాఫిక్ పోలీసు కేసు నమోదు చేసి జరిమానా విధించిన విషయాన్ని వివరిస్తూ..ఆ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వైరల్ ఫోటోని చూసి పోలీసులు సైతం నిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదన్నట్లుగా జరిమానా విధించారంటూ... పలువురు ప్రశంసిస్తే, మరికొంతమంది ఇది స్టేజ్ స్టంట్ కాబోలు లేకపోతే సదరు వ్యక్తి ఫోటోలో ఎలా నవ్వుతున్నాడంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయ నాయకుడి విడుదల...అట్టహాసంగా ఘనస్వాగతం)
Comments
Please login to add a commentAdd a comment