
హాట్ మోడల్, వివాదస్పద నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పూనమ్ ఇటీవల గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించిందని ఆరోపిస్తూ ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఆమెపై ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా సంస్కృతి, చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకే కేసు పెట్టామని గోవా ఫార్వర్డ్ మహిళా విభాగం పేర్కొంది. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వీడియో షూట్‌కు అనుమతి ఇచ్చినందుకు ఇద్దరు పోలీసులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
కాగా, గతంలో పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబే పై దక్షిణ గోవాలోని కెనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.సామ్ అహ్మద్ తనపై దాడి చేసి, చెంపదెబ్బ కొట్టినట్లు పూనమ్ ఆరోపించింది. ఆ తర్వాత సామ్ బాంబే బెయిల్ పై విడుదలయ్యాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే పూనమ్ మనసు మార్చుకొని భర్తతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది.
Comments
Please login to add a commentAdd a comment