వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి | Telugu actress rescued from Goa prostitution racket | Sakshi
Sakshi News home page

వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి

Published Wed, Jun 3 2015 8:57 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి - Sakshi

వ్యభిచార కూపం నుంచి టాలీవుడ్ నటికి విముక్తి

పణజి: తెలుగు, హిందీ భాషల్లో పలు హిట్ సినిమాల్లో తనదైన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించి.. ప్రస్తుతం వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన ఓ టాలీవుడ్ నటిని గోవా పోలీసులు కాపాడారు. పణజి ఇన్స్పెక్టర్ సిద్దాంత్ శిరోద్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా ఛాన్సులు తగ్గటంతో దాన్ని అవకాశంగా తీసుకుని సదరు నటీమణిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు సాక్షాత్తు ఆమె సహాయకురాలు ఆయేషా సయ్యద్ (30) పథకం రచించింది.

ఈ క్రమంలోనే నటి, ఆమె సహాయకురాలు మంగళవారం ఉదయం పణజికి చేరుకుని ఓ ఫైవ్స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. రాత్రయిన తర్వాత  ఆ గదికి ఓ బడాబాబు చేరుకున్నాడు. అంతలోనే సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ పై పోలీసులు దాడిచేశారు. విటుడు పోలీసుల కన్నుగప్పి పారిపోగా, నటిని, ఆమె సహాయకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు ఆయేషా ప్రయత్నిస్తోందని నటీమణి పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించామని, ఆయేషాపై కేసు నమోదుచేసి, విటుడి కోసం గాలిస్తున్నామని శిరోద్కర్ తెలిపారు. కాగా వ్య‌భిచారం చేయ‌డానికి వెళ్లిన  విటుల‌పై కూడా 370 ఏ కేసు పెట్ట‌వ‌చ్చ‌ని హైకోర్టు ఇటీవలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే విటుడికి ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement