మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ విజేత చెన్నైయిన్ కెప్టెన్ ఎలానో బ్లూమర్‌ను ఆదివారం అర్ధరాత్రి గోవా పోలీసులు అరెస్టు చేశారు. మ్యాచ్ అనంతరం జరుపుకొనే వేడుకల్లో గోవా ఫ్రాంచైజ్ సహ యజమాని దత్తరాజ్ సల్గవోన్సర్‌పై ఎలానో భౌతిక దాడికి పాల్పడ్డాడు. సల్గవోన్సర్ ఫిర్యాదు మేరకు ఎలానోను అరెస్టు చేసినట్లు మార్గావ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీఎల్ పాటిల్ తెలిపారు.