Hollywood Star Robert De Niro Welcomes Seventh Child at Age 79, Deets Inside - Sakshi
Sakshi News home page

రెండు పెళ్లిళ్లు పెటాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రైన ఆస్కార్‌ విజేత

May 10 2023 5:03 PM | Updated on May 10 2023 5:31 PM

Hollywood Star Robert De Niro Welcomes Seventh Child at Age 79 - Sakshi

ఆరుగురు కాదు, ఏడుగురు పిల్లలు అని చెప్పుకొచ్చాడు. ఈ మధ్యే తాను ఏడోసారి తండ్రయ్యానని వెల్లడించాడు. అయితే..

హాలీవుడ్‌ హీరో రాబర్ట్‌ డి నిరో మరోసారి తండ్రయ్యాడు. అందులో ఆశ్చర్యపోవడానికేముందంటారేమో! ఆయనకు ఇప్పుడు 79 ఏళ్లు కాగా పుట్టిన బిడ్డ ఏడో సంతానం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. ఎబౌట్‌ మై ఫాదర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్‌కు తన ఆరుగురు పిల్లల గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు మధ్యలో కలగజేసుకుంటూ నాకు ఆరుగురు కాదు, ఏడుగురు పిల్లలు అని చెప్పుకొచ్చాడు.

ఏడోసారి తండ్రైన స్టార్‌ హీరో
ఈ మధ్యే తాను ఏడోసారి తండ్రయ్యానని వెల్లడించాడు. అయితే ఆ బిడ్డకు తల్లెవరన్నది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం అతడు నటి టిఫానీ చెన్‌తో ప్రేమలో ఉన్నాడు. ఆ మధ్య టిఫానీ, రాబర్ట్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు బేబీ బంప్‌ ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో టిఫానీయే రాబర్ట్‌ ఏడో సంతానానికి తల్లి కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రెండు పెళ్లిళ్లు- విడాకులు, మరో ఇద్దరితో సహజీవనం
కాగా రాబర్ట్‌ డి నిరో మొదట డయానే అబాట్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి డ్రీనా అనే కూతురు(51), రఫేల్‌(46) అనే కుమారుడు ఉన్నారు. తర్వాత ఆమెతో తెగదెంపులు చేసుకున్న ఈయన మోడల్‌, నటి టుకీ స్మిత్‌తో సహజీవనం చేశాడు. 1995లో వీరికి కవలలు జులైన్‌, ఆరన్‌(27) జన్మించారు. కొంతకాలం తర్వాత ఆమెతో పొసగలేకపోయిన రాబర్ట్‌.. గ్రేస్‌ హైటవర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎల్లియట్‌ (24), హెలెన్‌ గ్రేస్‌(11) అనే పిల్లలున్నారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. గ్రేస్‌కు సైతం విడాకులిచ్చి ఇప్పుడు టిఫానీతో ప్రేమాయణం నడుపుతున్నాడు.

రెండుసార్లు ఆస్కార్‌ విజేతగా..
గొప్ప నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన రాబర్ట్‌.. ద గాడ్‌ ఫాదర్‌: పార్ట్‌ 2, ర్యాగింగ్‌ బుల్‌, ట్యాక్సీ డ్రైవర్‌, ద ఐరిష్‌మ్యాన్‌ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. పలు సార్లు ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ఆయనకు రెండు సార్లు అకాడమీ అవార్డు వరించడం విశేషం. అలాగే ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ను సైతం అందుకున్నాడు.

చదవండి: ది కేరళ స్టోరీ సినిమాపై నటి పోస్ట్‌.. ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement