
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తనపై మోపిన అభియోగాలను తొలగించాలంటూ తేజ్‌పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బాబ్డేల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించి ఉండాల్సిందని తేజ్‌పాల్ తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇంతలోనే విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment