Nageshwara Rao
-
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
నాగేశ్వరరావు గారి చివరి క్షణాలు నాకు బాగా గుర్తుంది
-
ఆ హీరోయిన్ విషయంలో నాకు నాగేశ్వర్ రావుకు మనస్పర్థలు వచ్చాయి..
-
నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై.. ప్రధానిని ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’అనేది పాత మాట అని ట్వీట్ చేశారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత, వివక్షాపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసింది’అని పేర్కొన్నారు. ‘నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే’అని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారన్నారు. (చదవండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి ఆత్మహత్య ) “అయినను పోయి రావలె హస్తినకు”అనేది పాత సామెత నాగేశ్వర్ గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందొ నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే That’s why he chose to express dissent by Boycotting https://t.co/9cjppJnT3E — KTR (@KTRTRS) August 8, 2022 -
దూళిపాళ్ల అక్రమాలు బయటపెట్టాలి
-
శ్రీవారి ముచ్చట్లు @40
కాలు పెట్టిననాడే కాపురం చేసే కళ తెలుస్తుందని సామెత. కొన్ని సంవత్సరాలు మొదటి రోజునే తమ విజయోత్సవ లక్షణాన్ని బయటపెట్టేస్తాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అలాంటి ఏడాది – 1981. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం జనవరి 1న దాసరి దర్శకత్వంలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, తాతినేని రామారావు దర్శకత్వంలో శోభన్ బాబు ‘పండంటి జీవితం’తో ఆ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం మొదలైంది. ఇద్దరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువుండే హీరోలే. ఇద్దరి సినిమాలూ లేడీస్ సబ్జెక్ట్లే. ఒకే రోజున రెండూ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. గమ్మత్తుగా రెండూ హిట్టే. అలా మొదలైన ఆ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, ఎన్టీయార్ ‘కొండవీటి సింహం’ లాంటి ఎన్నో ఘన విజయాలను అందించింది. చరిత్రకెక్కిన తల్లీ కూతుళ్ళు తెలుగు సినీ చరిత్రలో తొలి తరం మహిళా నిర్మాతల్లో ఒకరు సి. కృష్ణవేణి. జీవిత భాగస్వామి అయిన శోభనాచలా పిక్చర్స్ మీర్జాపురం రాజా గారి బాటలో ఆమె ఎన్టీఆర్ ‘మనదేశం’ లాంటి సినిమాలు తీశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, వారి సంతానమైన ఎన్.ఆర్. (నంగునూరి రాజ్యలక్ష్మీ) అనూరాధాదేవి కూడా మహిళా నిర్మాతగా పలు చిత్రాలు తీయడం విశేషం. తెలుగు సినీచరిత్రలో ఇలా తల్లీ కూతుళ్ళిద్దరూ నిర్మాతలుగా వెలిగిన అరుదైన ఘట్టం ఇది. పైపెచ్చు, తల్లితండ్రులు తీసిన సినిమాల (‘కీలుగుర్రం’) బాటలో కూతురు కూడా అదే హీరో అక్కినేనితో ఏకంగా 6 సినిమాలు (‘చక్రధారి’, ‘రావణుడే రాముడయితే’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘రాముడు కాదు కృష్ణుడు’, ‘అనుబంధం’, ‘ఇల్లాలే దేవత’) తీయడం విశేషం. ముక్కోణపు డ్రామా అక్కినేని, దాసరి కాంబినేషన్లో అంతకు ముందు ‘రావణుడే రాముడయితే’ (1979) నిర్మించారు అనూరాధాదేవి, శ్రీనివాసరావు దంపతులు. అది రిలీజైన ఏడాదికి మళ్ళీ అదే సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వారు నిర్మించిన ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిల్మ్ ‘శ్రీవారి ముచ్చట్లు’ (1981). అక్కినేని, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రధారులుగా మహిళలు మెచ్చిన ముక్కోణపు కుటుంబకథ ఇది. ప్రేమించిన కాశ్మీరీ పిల్ల(జయప్రద)తో కాకుండా అనుకోని పరిస్థితుల్లో అయినవాళ్ళ అమ్మాయి (జయసుధ) సంబంధం చేసుకుంటాడు హీరో. తీరా తాళి కట్టాక, ప్రేమించిన పిల్ల పెళ్ళిమండపంలోకి వస్తుంది. ఆ ఇద్దరు స్త్రీల మధ్య నలిగిన ఆ శ్రీవారి ముచ్చట్లు ఏమిటి, ఒకరి సంగతి మరొకరికి తెలిసి ఆ స్త్రీమూర్తులు చేసిన త్యాగం ఏమిటన్నది సినిమా. ఒక సినిమా... రెండు ఓపెనింగ్లు... కథానుసారం కాశ్మీర్లో జరిగే ‘శ్రీవారి ముచ్చట్లు’ ఓపెనింగ్, ఓ మేజర్ షెడ్యూల్ అక్కడే చేశారు. హీరో, హీరోయిన్లతో దాసరి, నిర్మాతలు ఫ్లైట్‌లో చేరారు కానీ, కెమేరాతో సహా యూనిట్‌గా బయల్దేరిన దాసరి శిష్యుడు రేలంగి నరసింహారావు బృందానికి జమ్ము నుంచి కాశ్మీర్ రైలు మిస్సయింది. మరునాడే ముహూర్తం షాట్. నిర్మాత శ్రీనివాసరావు ముహూర్తం సెంటిమెంట్. దాంతో దేవుడి పటాల కోసం రాత్రికి రాత్రి జమ్మూ అంతా రేలంగి వెతికారు. చివరకు కృష్ణుడి పటాలు మినహా ఏమీ దొరకలేదు. కథ ప్రకారం హీరో పాత్రకు శ్రీకృష్ణుడి పటం సరిపోతుందని, దాని మీదే జమ్ములో ముహూర్తం షాట్ చేశారు రేలంగి. మరోపక్క కాశ్మీర్లో తన వద్ద యూనిట్ ఏమీ లేకపోయినా నిర్మాత సెంటిమెంట్ కోసం హీరో, హీరోయిన్లకు మేకప్ వేయించి, స్థానిక స్టిల్ ఫోటోగ్రాఫర్‌తో ఫోటోలు తీయించారు దాసరి. పాటలతో... కాసుల మూటలు నిజానికి, ఈ సినిమా టైటిల్ సాంగ్ వేటూరి రాయాల్సింది. ఆయన టైముకు బెంగుళూరు రాకపోవడంతో, నిర్మాతల కోరిక మేరకు సినిమాలో రెండుసార్లు వచ్చే ‘శ్రీవారి ముచ్చట్లు’ అనే టైటిల్ సాంగ్ ను దాసరే రాసేశారు. అదే ఊపులో సినిమాలో పాటలన్నీ దాసరి రచనలయ్యాయి. సినిమా రిలీజుకు ముందే ‘కాళ్ళా గజ్జా కంకాళమ్మా’ మొదలు ‘శ్రీవారి ముచ్చట్లు’ టైటిల్ సాంగ్, ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’, ‘ఉదయకిరణ రేఖలో...’ – ఇలా పాటలన్నీ మారుమోగేవి. ఆ క్రేజుతో రిలీజైన సినిమా సూపర్ హిట్టయి, కాసులు కురిపించింది. పూర్ణా పిక్చర్స్ జి. విశ్వనాథ్ పంపిణీ చేసిన ఈ చిత్రం తొలి వారంలో ఏకంగా రూ. 22 లక్షలు వసూలు చేసింది. హీరోగా అక్కినేని కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. కాశ్మీరులో ఈ సినిమా షూటింగ్ లోనే దాసరికి ‘ప్రేమాభిషేకం’ (1981) స్టోరీ లైన్ తట్టింది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజు వేళ నిర్మాత అనూరాధాదేవి, పూర్ణా పిక్చర్స్ వారి విజయవాడ ఊర్వశి థియేటర్‌కు వెళ్ళారు. సినిమా చూసి జనసందోహం మధ్య నుంచి ఆమె, ‘పూర్ణా’ విశ్వనాథ్, ఆయన సోదరుడు బాలు అంబాసిడర్ కారులో హోటలుకు బయలుదేరారు. సినిమా చాలా బాగుందనే ఆనందంలో అభిమాన ప్రేక్షకులు తాము కూర్చున్న కారును ఆనందంగా పైకి ఎత్తేశారని అనూరాధాదేవి ఇప్పటికీ గుర్తు చేసు కుంటారు. విశేష మహిళా ప్రేక్షకాదరణతో ‘శ్రీవారి ముచ్చట్లు’ నేరుగా 5 కేంద్రాల (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్ లలో 100 రోజులు, కాకినాడలో 98 రోజులు)లో, నూన్ షోలతో 9 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మధ్యాహ్నం ఆటలతో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ‘శ్రీవారి ముచ్చట్లు’ రిలీజైన సరిగ్గా 48 రోజుల తర్వాత వచ్చిన ఇదే కాంబినేషన్లో ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. అది ఏకంగా ఏడాది ఆడి, గోల్డెన్ జూబ్లీ జరుపుకొంది. అప్పట్లో నెల్లూరు కల్యాణి కాంప్లెక్స్ (కృష్ణ– కావేరి–కల్యాణి థియేటర్స్)లో ‘శ్రీవారి ముచ్చట్లు’ శతదినోత్సవం ఘనంగా చేశారు. తమిళ స్టార్ శివాజీ గణేశన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైల్వే ట్రాకు పక్కనే ఉన్న ఆ సినిమా హాలులో వేడుకలలో పాల్గొంటున్న అక్కినేని, తదితర తారలను రైళ్ళు ఆపి మరీ జనం చూడడం గమనార్హం. కాశ్మీర్ షూటింగ్... కచ్చిన్స్ డ్రెస్సులు... కాశ్మీరులో 15 రోజుల షెడ్యూల్లో 4 పాటలు, 10 సీన్లు తీశారు. బొంబాయిలోని ప్రసిద్ధ కచ్చిన్స్ సంస్థ అక్కినేనికీ, కాశ్మీరీ పాత్రలోని జయప్రదకూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అందించింది. ఒక పాటలో అక్కినేని డజను డ్రస్సులు మార్చారు. షెడ్యూల్ చివరలో పని ముగించుకొని అక్కినేని, దాసరి వచ్చేస్తే, జయప్రద, చాట్ల శ్రీరాములుపైన కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ రేలంగే షూట్ చేశారు. హిందీ రీమేక్‌లో రేఖ అనుమానం! ఈ హిట్ చిత్రాన్ని మూడేళ్ళ తరువాత హిందీలో ‘ఆశాజ్యోతి’ (1984) పేరిట దాసరి దర్శకత్వంలోనే నిర్మాత కోవై చెళియన్ తీశారు. రాజేశ్ ఖన్నా, రేఖ, రీనారాయ్ తారాగణం. హిందీ రీమేక్ రెండో షెడ్యూల్ సమయంలో దాసరి మరో సినిమా పనిలో బిజీగా ఉన్నారు. దాంతో, మైసూరులో చేయాల్సిన 15 రోజుల షూటింగ్‌ను శిష్యుడు రేలంగి నరసింహారావుకు అప్పగించారు. తీరా రేలంగి అక్కడకు వెళ్ళాక రేఖ తదితరులకు అనుమానం వచ్చింది. తొలి షెడ్యూలులో నిర్మాతకూ, దాసరికీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందుకని నిర్మాతే, దాసరి బదులు రేలంగిని తెచ్చారేమోనని భ్రమపడ్డారు. ఆ మాటే రేఖ అచ్చ తెలుగులో గౌరవంగా రేలంగితో చెప్పేశారు. చివరకు దాసరి ఫోన్ చేసి, రేలంగిని తానే పంపినట్టు వివరించారు. హిందీలోనూ ఈ లేడీస్ సెంటిమెంట్ కథ సక్సెస్ సాధించింది. - రెంటాల జయదేవ -
‘స్వామి అగ్నివేశ్ మేక వన్నె పులి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు ఇంటర్నెట్ వేదికగా స్వామి అగ్నివేశ్‌ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు నాగేశ్వర రావు. (చదవండి: దేవుళ్ల రథాలపై మరింత నిఘా..) GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్మెంట్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమే కాక మానవ జీవితానికి సిగ్గు చేటు అన్నారు. ఇక పోలీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్ చేసింది. GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 -
ఎంక్వైరీ చేస్తుంటే భుజాలు తడుముకోవడమెందుకు?
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తూ కుట్ర చేస్తోందని బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నేత బుద్ధా నాగేశ్వరరావు ఆరోపించారు. సావిత్రీభాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి విజయవాడలో నివాళులు అర్పించారు. అనంతరం బుద్ధా విలేకరులతో మాట్లాడుతూ.. డేటా చోరీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంటే ఏపీ ప్రభుత్వం భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. మహిళల చదువుకు సావిత్రీబాయి పూలె ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రీబాయి పూలె పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని వారిలో చైతన్యం తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. -
నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు
న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్(ఇన్చార్జ్)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్ హోదాలో విధులకు హాజరైన ఆలోక్ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు. -
టీడీపీ కథ కంచికే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ కంచికి చేరడం ఖాయమైంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే టీడీపీ అడ్రస్ గల్లంతు చేసేందుకు అధికార టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను మళ్లీ మొదలుపెడుతోంది. ముందుగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్ మిగిలిన పార్టీల వారిని చేర్చుకునే విషయంలోనూ వేగంగానే నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ (వైరా) ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. ఆకర్ష్‌లో భాగంగా మొదట టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావు పేట)లను ఒకేసారి పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. గత అసెంబ్లీలో చేసినట్లుగా ఈసారి టీడీపీ శాసనసభా పక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేసేలా వ్యూహం రచించింది. సండ్రకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మెచ్చాకు గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) చైర్మన్ పదవులు ఇచ్చేందుకు అవకాశముందని సమాచారం. ఉత్సాహం.. ఊగిసలాట వాస్తవానికి, తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలనే వ్యూహంతోనే మొదట్నుంచీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పావులు కదిపారు. తాజా ఎన్నికల్లో మహాకూటమితో కలిసి 13 చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకుంటే అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారికంగా టీడీపీ పక్షం టీఆర్ఎస్లో విలీనం అవుతుంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అధికార పార్టీ రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించింది. దీంతో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరడం ఖాయమంటూ 15రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఆయన కొంత ఊగిసలాటలో ఉన్నారని చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ నేతల సంప్రదింపులతో మెత్తబడ్డారని తెలుస్తోంది. చంద్రబాబు ఒత్తిడి తెచ్చినా! టీఆర్ఎస్లో చేరేందుకు మొదట్నుంచీ సిద్ధంగానే ఉన్న సండ్ర మంత్రి పదవి లభిస్తే బాగుంటుందని భావించారు. తనతో పాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్లోకి తీసుకెళ్లడం ద్వారా కేసీఆర్ నుంచి ఆ మేరకు హామీ తీసుకోవచ్చనుకున్నారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమై వారిని కూడా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధం చేశారు. కానీ, మెచ్చా మొదట్లో ససేమిరా అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే ఉంటానంటూ అమరావతికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చారు. పార్టీ మారొద్దంటూ మెచ్చాపై చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చారు. సండ్ర వెళ్లినా టీడీపీలోనే ఉంటే ఆయన స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెచ్చా కొంత మెత్తబడ్డట్టు కనిపించింది. అయితే, టీఆర్ఎస్ నేతల చర్చలతో పాటు నియోజకవర్గ నేతలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్లాలని, అయితే, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగానే పార్టీలోకి వెళ్లాలని మెచ్చాకు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతల సూచన, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతల ఒత్తిడి మేరకు ఆయన కూడా చివరకు ఓకే చెప్పేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం. 8 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా.. టీడీపీ శాసనసభ పక్షం విలీనం పూర్తి కాగానే.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై చేరిక వ్యూహాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ అంతా సిద్ధం చేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. వీరిలో 8మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నారు. అయితే ఒక్కొక్కరు చొప్పన కాకుండా ఒకేసారి కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసే దిశగా టీఆర్ఎస్ వ్యూహం రచించింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన వారిలో 13 మంది ఒకేసారి టీఆర్ఎస్లో చేరితే న్యాయపరమైన ఇబ్బందులు లేమీ ఉండవు. దీంతో ఒకేసారి ఆ మేరకు టీఆర్ఎస్లో చేర్చుకునేలా ప్రణాళిక పూర్తవుతోంది. జనవరి 17నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోపే.. టీడీపీ ఎమ్మెల్యేల చేరిక జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలలోపు కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనం జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ సీట్ల గెలుపు లక్ష్యం జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమార్పు లక్ష్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో మజ్లిస్ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలను గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలలో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడింది. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఒక్క స్థానం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలచుకున్నాయి. 16 ఎంపీ సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్కు ఈ రెండు లోక్‌సభ సెగ్మెంట్లలో ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ సభ్యులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరితోపాటు మిగిలిన జిల్లాల్లోని 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే సాంకేతికంగా ఇబ్బందులు ఉండబోవని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా వీలైనంత త్వరగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల చేరికను పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. -
పుట్టకముందే పునర్జన్మ!
సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఉండగానే ఓ శిశువు గుండెకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. మూసుకుపోయిన గుండె రక్తనాళాలను తెరిచి జన్మించకముందే పునర్జన్మ ప్ర సాదించారు. ఇలాంటి చికిత్స దేశంలోనే తొలిదని వైద్యులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో డాక్టర్ కె.నాగేశ్వరరావు, డాక్టర్ టీవీఎస్ గోపాల్, డాక్టర్ శ్వేతబాబు, డాక్టర్ జగదీశ్, డాక్టర్ రియాజ్‌ఖాన్, డాక్టర్ రాఘవరాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. 25వ వారంలో బయటపడ్డ లోపం కడప జిల్లా చిన్నమడెంకు చెందిన కీర్తి క్రిస్టఫర్(31)కు ఏడాది కింద వివాహమైంది. ఆమె గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా 25వ వారంలో ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా, కడు పులో ఉన్న బిడ్డ గుండె (పల్మనరీ వాల్వ్)రక్తనాళం మూసుకుపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పరిష్కారం కోసం రాయచూర్, కడపలోని వైద్య నిపుణులను సంప్రదించారు. వారి సూచన మేరకు మే చివరిలో కేర్ వైద్యులను సంప్రదించారు. పీడియాట్రిక్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్రావు వైద్య పరీక్షలు చేశారు. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే పల్మ నరీ వాల్వ్ మూసుకుపోవడంతో బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో లోపమున్నట్లు గుర్తించారు. చికిత్స అందించకుంటే కుడివైపు ఉన్న జఠరికం చిన్నగా మారుతుందని అన్నారు. శిశువు జన్మించాక ఊపిరితిత్తులకు రక్తం సరఫరా కాక, బిడ్డ శరీరం నీలం రంగులోకి మారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని, చికిత్స చేస్తే బతికించొచ్చని తెలి పారు. కీర్తి క్రిస్టఫర్ అంగీకరించడంతో జూన్ తొలివారంలో చికిత్స చేశారు. చికిత్స ఎలా చేశారంటే? చికిత్స సమయంలో బిడ్డ కదలికలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో కడుపులోని బిడ్డ కదలికలను నియంత్రించేందుకు ముందు 18జీ సూదితో తల్లి ఉదరభాగం నుంచి బిడ్డ తొడభాగానికి ఇంజెక్షన్ ద్వారా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత తల్లికి మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ సాయంతో తల్లి గర్భం నుంచి బిడ్డ గుండె వరకు సూదిని పంపారు. అదే సూది ద్వారా ఓ బెలూన్ను రక్త నాళంలోకి పంపి, మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరిపించారు. ఈ ప్రక్రియ కు 48 నిమిషాల సమయం పట్టింది. ఇదే సమయంలో మరో బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు కడుపులోని బిడ్డ వయసు ఇరవై ఆరున్నర వారాలు మాత్రమే. ఇటీవల కీర్తి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బిడ్డ 3.2 కేజీల బరువు ఉంది. బిడ్డ పుట్టిన రెండోరోజే రెండో బ్లాక్‌నూ బెలూన్ సాయంతో తెరిపించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి చికిత్సలు ఐదు చేయగా, మూసుకుపోయిన గుండె రక్తనాళం తెరిపించడం ఇదే మొదటి సారని వివరించారు. -
ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉమా మహేశ్వర రావుపై వేటు పడింది. గత కొంతకాలం నుంచి వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌గా అకాడమిక్ విభాగం డీన్ ప్రొ. కె నిరంజన్ను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇద్దరి మధ్యగల విభేదాలపై పాలకమండలి సభ్యులు చర్చించారు. సమావేశం అనంతరం వీసీ, ఉమా మహేశ్వరరావును తొలగిస్తూ.. కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన రిజిస్ట్రార్‌గా నిరంజన్ బాధ్యతలు స్వీకరించారు. -
‘తేజ్‌పాల్’ విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
న్యూఢిల్లీ: తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తనపై మోపిన అభియోగాలను తొలగించాలంటూ తేజ్‌పాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బాబ్డేల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించి ఉండాల్సిందని తేజ్‌పాల్ తరపున కపిల్ సిబల్ వాదించారు. ఇంతలోనే విచారణ నుంచి జడ్జి తప్పుకున్నారు. -
'చంద్రబాబు క్షమాపణ చెప్పాలి'
-
ఆహ్లాదంగా జెక్‌ఫెస్ట్ వేడుకలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : స్థానిక గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక జెక్‌ఫెస్ట్- 2014’ వేడుకలు ఉత్సాంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి నిర్వహించిన కళా ప్రదర్శనలు, శుక్రవారం జరిగిన సాంకేతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు విద్యార్థుల్లో ఉత్సాహం నింపాయి. గురువారం రాత్రి కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాశి కంటే వాసి గొప్పదని భావించి, ప్రాచీన కళల్లో వాసికెక్కిన కళాకారులతో తమ కాలేజీలో ప్రదర్శనలు ఇప్పించి, వారిని సన్మానించడం ఏటా జెక్ఫెస్ట్లో వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆరుపదుల పైబడిన వయసులో పద్మశ్రీ కుంకుమ మొహంతి తన బృందంతో చేసిన ఒడిస్సీ నృత్యం ఆకట్టుకుంది. అనంతరం మొహంతిని కాలేజీ యాజమాన్యం సత్కరించింది. గాయకుడు ఎల్.వి.గంగాధరశాస్త్రి తన బృందంతో ‘ఘంటసాల వెంకటేశ్వరరావు నీరాజనం’ కార్యక్రమం నిర్వహించారు. రైతు వ్యక్తిత్వం, పుడమితల్లి పులకరింతలపై సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రసంగించారు. శుక్రవారం జెక్‌ఫెస్ట్ రోబోరేస్ తదితర ఆసక్తికర అంశాలతో ఉత్సాహభరితంగా జరిగింది. ఉత్కంఠభరితంగా జాతీయ క్రీడలు... జీఈసీలో జాతీయస్థాయి క్రీడాపోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఇంజినీరింగ్ కాలేజీల క్రీడాకారులు తలపడుతున్నారు. ఈ పోటీలు శుక్రవారం సెమీ ఫైనల్‌కు వచ్చాయి. ఫైనల్స్ ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వాలీబాల్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరిన కాలేజీలు భీమవరం విష్ణు కాలేజీపై కోరంగి కేఐఈటీఐ, నరసరావుపేట ఎన్ఈసీపై జగ్గయ్యపేట మండవ ఇంజినీరింగ్ కాలేజీ, ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీపై చెవుటూరు శ్రీవాణి ఇంజినీరింగ్ కాలేజీ, జూపూడి నిమ్ర కాలేజీపై విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీ, తేలప్రోలు ఉషారామాపై విశాఖపట్నం రఘు, గంగూరు ధనేకులపై సూరుపాలెం ఆదిత్య, తాడేపల్లిగూడెం శ్రీవాసవీపై ఏలూరు రామచంద్ర, లంకపల్లి సన్‌ఫ్లవర్‌పై నందమూరు వాసవీ, నూజివీడు ఆర్ఐఐఐటీపై చీరాల సెయింట్ ఆన్స్ కాలేజీ జట్లు విజయం సాధించి సెమీస్‌కు చేరాయి. బాస్కెట్ బాల్లో... గంగూరు ధనేకుల ఇంజినీరింగ్‌పై కాకినాడ కైట్, సాయి స్ఫూర్తిపై మైలవరం లకిరెడ్డి బాలరెడ్డి, నూజివీడు ఎస్ఎస్ఐటీపై సత్తెనపల్లి నలంద, వైటీమ్పై భీమవరం ఎస్ఆర్కేఆర్, జూపూడి నిమ్రాపై లంకపల్లి సన్‌ఫ్లవర్, భీమవరం విష్ణుపై నందమూరు శ్రీవాసవీ, కేఎల్ యూనివర్సిటీపై విజయవాడ లయోలా, శ్రీరామచంద్రపై నరసరావుపేట, నూజివీడు ట్రిపుల్ ఐటీపై ఖమ్మం ఎవీఐటీ, ఏలూరు సీఆర్రెడ్డిపై రఘు, శ్రీవాసవీపై ప్రగతి, ఎంవీఆర్‌పై కాకినాడ కైట్, విశాఖపట్నం రఘుపై హైదరాబాద్ సెయింట్ మార్టిన్ కాలేజీ జట్లు విజేతలుగా నిలిచి సెమీస్‌కు చేరాయి. -
వత్సవాయి సొసైటీలో గోల్మాల్ !
వత్సవాయి, న్యూస్‌లైన్ : పిల్లల ఉన్నత చదువులు, పెళ్ళిళ్లు, వ్యవసాయ పనులు తదితర అవసరాల కోసం స్థానిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఖాతాదారులు దాచుకున్న సొమ్మును సిబ్బంది గోల్మాల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల్లో కొందరు సొసైటీ కార్యాలయానికి వచ్చి తాము దాచుకున్న డబ్బు తమ ఖాతాలలో లేదని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు వచ్చి న సొసైటీకి వచ్చిన బాధితులకు సంబంధించిన ఖాతాల్లో రూ.10 లక్షలకు పైగా మాయం అయినట్లు తేలింది. ఇంకా ఈ విషయం తెలియని వారు ఎక్కువమంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సొసైటీలో రెండువేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలోనే నగదు మాయం అయినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సొసైటీలో రూ.2.20 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండగా, రూ.2 కోట్లకు పైగా బంగారు వస్తువులపై రుణాలు మంజూరు చేసినట్లు తెలి సింది. ఖాతాదారులు సొసైటీలో నగదు జమ చేసినప్పుడు వారి పాసు పుస్తకాలలో సిబ్బంది నమో దు చేశారు. సొసైటీ క్యాష్ రికార్డులలో మాత్రం ఎంట్రీలు లేవని, ఖాతాదారుల సొమ్మును సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. సొసైటీ క్యాషియర్ నాగేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చి తమ ఖాతాల వివరాలు తెలుసుకోగా, నగదు మాయం అయిన విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీలో సొమ్ము దాచుకున్న షేక్ జాన్మియా, కుక్కల ప్రసా ద్, కంచేటి రామారావు, షేక్ జాన్‌వలీ, ఎం.వెంకటేశ్వర్లు, మౌలాబీ, కొలుసు గంగిరాజు, పట్టాభి, ఆదాం సాహెబ్, వైకుంఠపు రామారావు, కంచం శ్రీను, ఎన్ వెంకటేశ్వర్లు, కొలికపోగు వెంకటనర్సమ్మ, గజ్జా జాలయ్య ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు కొందరు కార్యాలయానికి వచ్చారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సొసైటీ కార్యదర్శి చిట్టూరి శ్రీనివాసరావు, క్యాషియర్ రాయల నాగేశ్వరరావును వివరణ కోరగా, ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సొమ్ము రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.