ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్‌ | AU Registrar Uma Maheswara Rao Was Suspended | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 7 2018 11:11 AM | Last Updated on Sat, Jul 7 2018 12:01 PM

AU Registrar Uma Maheswara Rao Was Suspended - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఉమా మహేశ్వర రావుపై వేటు పడింది. గత కొంతకాలం నుంచి వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్‌ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌గా అకాడమిక్‌ విభాగం డీన్‌ ప్రొ. కె నిరంజన్‌ను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇద్దరి మధ్యగల విభేదాలపై పాలకమండలి సభ్యులు చర్చించారు. సమావేశం అనంతరం వీసీ, ఉమా మహేశ్వరరావును తొలగిస్తూ.. కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన రిజిస్ట్రార్‌గా నిరంజన్‌ బాధ్యతలు స్వీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement