Registrar Posts
-
ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉమా మహేశ్వర రావుపై వేటు పడింది. గత కొంతకాలం నుంచి వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌గా అకాడమిక్ విభాగం డీన్ ప్రొ. కె నిరంజన్ను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇద్దరి మధ్యగల విభేదాలపై పాలకమండలి సభ్యులు చర్చించారు. సమావేశం అనంతరం వీసీ, ఉమా మహేశ్వరరావును తొలగిస్తూ.. కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన రిజిస్ట్రార్‌గా నిరంజన్ బాధ్యతలు స్వీకరించారు. -
త్రిశంకు స్వర్గంలో నూతన వీఆర్వోలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కొత్తగా ఎంపికైన వీఆర్వోలు త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు. అన్ని జిల్లాలో ఎంపిక ప్రక్రియ పూర్తయి శిక్షణ పొందుతుండగా.. కర్నూలులో వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా పోస్టింగ్‌లు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీ నాటికే అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో మూడు వికలాంగుల పోస్టులు మినహా 102 వీఆర్వో పోస్టులను మెరిట్ రోస్టర్ ప్రాతిపదికన ఎంపిక చేశారు. కానీ పోస్టింగ్‌లు మాత్రం ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోస్టింగ్‌ల ప్రక్రియ పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పోస్టింగ్ ఉత్తర్వులు రిజిష్టర్ పోస్టు ద్వారా ఇళ్లకే పంపినట్లు చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఒక్కరికీ ఉత్తర్వులు అందకపోవడం గమనార్హం. వీఆర్ఓగా ఎంపికైనట్లు రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం ఇచ్చారే తప్ప పోస్టింగ్ ఉత్తర్వులు అందలేదని అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులు కావాలనే పోస్టింగ్‌లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ మంచి స్థానాల కోసం పైరవీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పోస్టింగ్ ఉత్తర్వులను రిజిస్టర్డ్ పోస్టులో పంపినట్లు తెలిపారు. -
హైకోర్టులో రిజిస్ట్రార్ పోస్టులు భర్తీ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు రిజిస్ట్రార్లుగా వ్యవహరించిన పలువురు న్యాయాధికారులు ఇటీవల హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులు కావడంతో ఏర్పడిన ఖాళీలను హైకోర్టు భర్తీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కె.శివప్రసాద్, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా వి.వెంకటప్రసాద్, రిజిస్ట్రార్ (ఎంక్వయిరీస్)గా జగన్నాథం, రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్)గా పి.ముత్యాలనాయుడు నియమితులయ్యారు. వీరిలో ముత్యాలనాయుడు శ్రీకాకుళం జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులు కావడంతో మంగళవారం ఆయన జిల్లా జడ్జి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రిజి స్ట్రార్ (విజిలెన్స్), రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్) పోస్టులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది.