uma maheshwar rao
-
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
-
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్కేసర్లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
కృష్ణమ్మ చెంత కరువు కరాళనృత్యం..
సాక్షి, కృష్ణా : ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన పాలకుల నిర్లక్ష్యంతో తీర ప్రాంతంలో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఏటా రెండు పంటలు, ఆక్వాసాగుతో కళకళలాడే ప్రాంతం కృత్తివెన్ను మండలం. కృష్ణా,గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతం కావడంతో ఇక్కడ కరవు అనే పదమే వినిపిం చేది కాదు. ఇలాంటి పచ్చని ప్రాంతంలో రెండు పంటలు కాదు కదా ఒక్క పంటకు కూడా నీరి వ్వకుండా రైతులను వ్యవసాయ కూ లీలుగా మార్చేసింది ప్రభుత్వం. 2014 ఎన్నికల తరువాత ఐదేళ్లలో రెండవ పంట కు నీరన్నదే లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకే సాగునీరు లేకుండాపోవ డం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువైన తాగునీరు.. సాగు సంగతి అలా ఉంటే కనీసం తాగునీరు అందించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. ఒ కానొక సమయంలో ప్రజలు తాగునీటి కోసం పోరాటానికి దిగిన సంఘటనలు లేకపోలేదు. దీనికి స్థానిక ఎమ్మెల్యే సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే నీటి కొరత ఏర్పడిందన్న వాదనలు వినిపిం చాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రెండు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం టీడీపీ అధికారం చేపట్టాక సాగునీరు, తాగునీటికి కరువై తీవ్రదుర్భిక్షాన్ని అనుభవించిందని ప్రజల్లో నాటుకు పోయింది. తీవ్ర దుర్భిక్షం నిత్యం రెండు పంటలతో కళకళలాడే ప్రాంతం మాది. ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగునీరు లేక పంటలు పండక రైతులే కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వ్యవసాయం మీద మక్కువతో రైతులు కష్టాలు ఎదురైనా పంటను సాగు చేస్తున్నారు.రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది. – ఆగిశెట్టి బాజ్జీ, గరిశపూడి గుక్కెడు నీటికి కష్టాలు సాగునీటి సంగతి దేవుడెరుగు. కనీసం తాగేందుకు కూడా నీరివ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో టీడీపీ పాలన సాగించింది. వరుసగా మూడేళ్లపాటు లక్ష్మీపురం రక్షిత మంచినీటి చెరువుకు నీరురాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – పులగం రాము, లక్ష్మీపురం -
ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉమా మహేశ్వర రావుపై వేటు పడింది. గత కొంతకాలం నుంచి వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌గా అకాడమిక్ విభాగం డీన్ ప్రొ. కె నిరంజన్ను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇద్దరి మధ్యగల విభేదాలపై పాలకమండలి సభ్యులు చర్చించారు. సమావేశం అనంతరం వీసీ, ఉమా మహేశ్వరరావును తొలగిస్తూ.. కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన రిజిస్ట్రార్‌గా నిరంజన్ బాధ్యతలు స్వీకరించారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విద్యానగర్ (గుంటూరు) : తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా వారి కష్టానికి తగినట్లుగా మంచి మార్కులు సాధించలేకపోతున్నానని మనస్తాపానికి గురై బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి అవుట్‌పోస్టు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనివాసరావుతోట 10వ లైనుకు చెందిన ఎన్.నరసింహారావు, భూలక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఒక కుమారుడు ఉమామహేశ్వరరావు(22), కుమార్తె ప్రసన్నకుమారి ఉన్నారు. ఉమామహేశ్వరరావు గుంటూరు రూరల్ మండలంలోని చౌడవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతుండగా, ప్రసన్నకుమారి నగరంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. తల్లిదండ్రులు కూలినాలీ చేసి చదివిస్తున్నా తనకు చదువు అబ్బడం లేదని, అదేవిధంగా చదవాలనే కోరిక కలగడం లేదని దాని ద్వారా మంచి మార్కులు సాధించలేకపోతున్నానని మనస్తాపంతో ఉమామహేశ్వరరావు ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నెరవేర్చలేకపోతున్నాననే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లెటర్ రాసి మంచంపై ఉంచాడని ఉమామహేశ్వరరావు తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. సంఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అవుట్‌పోస్టు సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
'వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా?'
నెల్లూరు: రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదన్న మంత్రికి నెల్లూరులో వేలాది ఎకరాల్లో పంట నష్టం కనిపించడంలేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వతీరును అసెంబ్లీలో ఎండగడతామని కాకాని తెలిపారు. ఈనెల 25న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో పబ్లిక్ అకౌంట్స్ కమీటీ పర్యటించనుందని చెప్పారు.