కాలినడకన నీటిని తెచ్చుకుంటున్న మహిళలు
సాక్షి, కృష్ణా : ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన పాలకుల నిర్లక్ష్యంతో తీర ప్రాంతంలో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఏటా రెండు పంటలు, ఆక్వాసాగుతో కళకళలాడే ప్రాంతం కృత్తివెన్ను మండలం. కృష్ణా,గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతం కావడంతో ఇక్కడ కరవు అనే పదమే వినిపిం చేది కాదు. ఇలాంటి పచ్చని ప్రాంతంలో రెండు పంటలు కాదు కదా ఒక్క పంటకు కూడా నీరి వ్వకుండా రైతులను వ్యవసాయ కూ లీలుగా మార్చేసింది ప్రభుత్వం.
2014 ఎన్నికల తరువాత ఐదేళ్లలో రెండవ పంట కు నీరన్నదే లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకే సాగునీరు లేకుండాపోవ డం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరువైన తాగునీరు..
సాగు సంగతి అలా ఉంటే కనీసం తాగునీరు అందించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. ఒ కానొక సమయంలో ప్రజలు తాగునీటి కోసం పోరాటానికి దిగిన సంఘటనలు లేకపోలేదు. దీనికి స్థానిక ఎమ్మెల్యే సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే నీటి కొరత ఏర్పడిందన్న వాదనలు వినిపిం చాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రెండు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం టీడీపీ అధికారం చేపట్టాక సాగునీరు, తాగునీటికి కరువై తీవ్రదుర్భిక్షాన్ని అనుభవించిందని ప్రజల్లో నాటుకు పోయింది.
తీవ్ర దుర్భిక్షం
నిత్యం రెండు పంటలతో కళకళలాడే ప్రాంతం మాది. ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగునీరు లేక పంటలు పండక రైతులే కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వ్యవసాయం మీద మక్కువతో రైతులు కష్టాలు ఎదురైనా పంటను సాగు చేస్తున్నారు.రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది.
– ఆగిశెట్టి బాజ్జీ, గరిశపూడి
గుక్కెడు నీటికి కష్టాలు
సాగునీటి సంగతి దేవుడెరుగు. కనీసం తాగేందుకు కూడా నీరివ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో టీడీపీ పాలన సాగించింది. వరుసగా మూడేళ్లపాటు లక్ష్మీపురం రక్షిత మంచినీటి చెరువుకు నీరురాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
– పులగం రాము, లక్ష్మీపురం
Comments
Please login to add a commentAdd a comment