Krishna - Godavari basin
-
సీమకు సైంధవుడు..
దేశంలోనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను మళ్లించకుండా నాడు చంద్రబాబు ద్రోహం చేయగా, నేడు గరిష్టంగా ఒడిసిపట్టి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి చాటుకుంటున్నారని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కృష్ణా జలాలపై హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకే తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతిలో పూర్తి సామర్థ్యం మేరకు నీటి తరలింపు పనులను పూర్తి చేయడంతోపాటు తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన గోరకల్లు, అవుకు రిజర్వాయర్లు, గాలేరు–నగరిలో భాగమైన గండికోట, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండలతోపాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని ఇప్పటికే పూర్తి చేయగా రెండో సొరంగం కూడా దాదాపుగా పూర్తి అయింది. నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను తరలించడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీలకు హక్కుగా దక్కిన జలాలను వాడుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతలను సీఎం వైఎస్ జగన్ చేపడితే దానిపై ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారని రైతులు మండిపడుతున్నారు.శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం, అవసరమైన చోట కొత్త ప్రాజెక్టులను నిరి్మంచడం కోసం రాయలసీమ కరవు నివారణ పథకం కింద సీఎం జగన్ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించడం ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని న్యాయ నిపుణులు ప్రశంసిస్తున్నారు.హంద్రీ–నీవా సుజల స్రవంతి..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక శ్రీశైలం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి రాయలసీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేలా హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.తన హయాంలోనే రూ.6,862.26 కోట్లు ఖర్చు చేసి సింహ భాగం పూర్తి చేశారు. హంద్రీ–నీవాకు తొలుత శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి నీటిని ఎత్తిపోసేలా మల్యాల వద్ద పంప్‌హౌస్ నిర్మించిన మహానేత వైఎస్.. ఆ తర్వాత నీటి మట్టం 795 అడుగుల్లో ఉన్నా నీటిని తరలించేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల 2007, ఆగస్టు 31న చేపట్టి, 2009 నాటికే 90 శాతం పూర్తి చేశారు. నాడు అలా..విభజన నేపథ్యంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హంద్రీ–నీవాలో మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. ఆ తర్వాత వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. జీవో 22(ప్రైస్ ఎస్కలేషన్), జీవో 63 (çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అక్రమంగా వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2017 జనవరి 3న జాతికి అంకితం చేసిన నాటి సీఎం చంద్రబాబు.. ఇది తన ఘనతే అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.హంద్రీ–నీవా అంతర్భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తరలించేందకు చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను కూడా కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమే‹Ùకు కట్టబెట్టిన చంద్రబాబు.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు తప్ప తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు.మహానేత వైఎస్ పూర్తి చేసిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా టీడీపీ హయాంలో ఏ ఒక్క ఏడాదీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా సీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారు.నేడు ఇలా..వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో కేవలం 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు.హంద్రీ–నీవాలో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు.హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి.. ఈ ఏడాదే కృష్ణా జలాలను కుప్పానికి తరలించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతి ఏటా డిజైన్ సామర్థ్యం కంటే అధికంగా హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు.తెలుగు గంగ..శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో తరలించే 29 టీఎంసీల కృష్ణా జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలను జతచేసి 59 టీఎంసీలను మళ్లించడం ద్వారా ఉమ్మడి కర్నూలు (1.08 లక్షల ఎకరాలు), వైఎస్సార్ కడప(1.67 లక్షల ఎకరాలు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు (2.54 లక్షల ఎకరాలు), చిత్తూరు జిల్లా (46 వేల ఎకరాలు) కలిపి మొత్తం 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది తెలుగుగంగ ప్రాజెక్టు ఉద్దేశం. నాడు అలా...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్సార్‌ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కలువ) ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు చేరే జలాల్లో 15 వేల క్యూసెక్కులను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్‌కు తరలించేలా 7.8 కి.మీ. పొడవున తవ్విన లింక్ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల 6 నుంచి 7 వేల క్యూసెక్కులను కూడా తరలించేందుకు వీలయ్యేది కాదు. దీంతో వెలిగోడు రిజర్వాయర్(16.95 టీఎంసీలు) నిండేది కాదు. లింక్ కెనాల్‌కు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యంతో నీటిని తరలించడం ద్వారా వెలిగోడును సకాలంలో నింపాలన్న ఆలోచన కూడా 2014–19 మధ్య చంద్రబాబు చేయలేదు.వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్‌కు ఐదు వేల క్యూసెక్కులను తరలించేలా 42.566 కిమీల పొడవున తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయకపోవడంతో 2 నుంచి 2,500 వేల క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి. బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు. మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున నాలుగైదు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. తెలుగుంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేసిన పాపాన పోలేదు. ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతులను దెబ్బతీశారు.నేడు ఇలా..వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్‌ను, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మంసాగర్ వరకూ ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు రూ.600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ కాలువల ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు నీటిని తరలించడానికి మార్గం సుగమం చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపగలిగారు.వెలిగోడు రిజర్వాయర్బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో నీటి నిల్వకు లైన్ క్లియర్ చేశారు. 2021–22 నుంచే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. తెలుగుగంగ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తూ రైతుల జీవన ప్రమాణాలను పెంచేలా సీఎం జగన్ కృషి చేశారు.బ్రహ్మంసాగర్గాలేరు – నగరి సుజల స్రవంతి..శ్రీశైలం నుంచి 38 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 1.55, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500 వెరసి 2.60 లక్షలకు సాగునీరు, ఐదు లక్షల మందికి తాగునీరు అందించేలా గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో చేపట్టారు. 2009 నాటికే వరద కాలువ, గండికోట రిజర్వాయర్, పైడిపాళెం, వామికొండ, సర్వారాయసాగర్‌ల జలాశయాలతోపాటు ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేశారు.నాడు అలా...2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరి ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల్లో అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద తవ్వాల్సిన జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్(పెలుసుమట్టి)లో 165 మీటర్ల మేర మాత్రమే పనులు చేయాలి. వాటిని చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ఒక సొరంగానికి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా కాలువ(లూప్)తో సరిపుచ్చారు.కమీషన్లు రావనే కారణంతో గాలేరు–నగరిలో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో కేవలం నాలుగైదు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లను పట్టించుకోలేదు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పది టీఎంసీల సామర్థ్యం) నిర్వాసితులకు కూడా చంద్రబాబు పునరావాసం కల్పించలేదు. ఏటా కేవలం సగటున రెండు మూడు టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించకుండా రైతుల కడుపుకొట్టారు.నేడు ఇలా..సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అంటే పది వేల క్యూసెక్కులను తరలించేలా అభివృద్ధి చేయించారు. రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనంతో పూర్తి చేశారు. ఇప్పుడు గాలేరు–నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. శ్రీశైలానికి వరద వచ్చిన 30 రోజుల్లోనే గాలేరు–నగరి కింద ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేలకు పెంచిన సీఎం జగన్ ఆ పనులను కూడా శరవేగంగా చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది.గండికోట రిజర్వాయర్గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో గండికోటలో ఏటా 26.85 టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించి.. రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం (ఆరు టీఎంసీలు), వామికొండసాగర్(1.6 టీఎంసీలు), సర్వారాయసాగర్(3.06 టీఎంసీలు)లలోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.600 కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. 2020–21, 2021–22, 2022–23లలో ఏటా పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రైతుల జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు.రైతుల హక్కులు నాడు తాకట్టు.. నేడు పరిరక్షణవిభజన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించింది. శ్రీశైలం నిర్వహణను ఆంధ్రప్రదేశ్‌కు, నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణకు అప్పగించింది. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని ఏపీకి అప్పగించకుండా తన అధీనంలోనే ఉంచుకోవడంపాటు ఏపీ భూభాగంలోని నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను కూడా అ«దీనంలోకి తీసుకుంది. రాష్ట్ర హక్కులను హరించేలా తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు.శ్రీశైలంలో 834(మల్యాల), 795(ముచ్చుమర్రి) అడుగుల నుంచి హంద్రీ–నీవా ద్వారా రోజుకు 3850 క్యూసెక్కులు మాత్రమే తరలించే సామర్థ్యం ఏపీకి ఉంది. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 881 అడుగుల్లో నీటి మట్టం శ్రీశైలంలో ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. తెలంగాణ సర్కార్ రోజూ 6.5 టీఎంసీలను తోడేస్తే శ్రీశైలంలో నీటి మట్టం పెరగదు. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందవు. ఓటుకు కోట్లు కేసుకు జడిసి బాబు నోరుమెదపలేదు.వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతోపాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఇది పూర్తయితే తనకు భవిష్యత్ లేదని చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
లెక్క తేలాకే కావేరికి గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చకుండా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టడంలో అర్థం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. మొదట నీటి లభ్యతను తేల్చాలని, ఆ తర్వాతే కావేరికి గోదావరి జలాలను ఎలా తరలించాలో చర్చించాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 69వ సమావేశం బుధవారం వర్చువల్‌గా జరిగింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా కావేరికి తరలించడం ద్వారా నదులను అనుసంధానం చేయడానికి సంబంధించిన డీపీఆర్‌ను నదీ పరివాహక ప్రాంతాల్లోని 4 రాష్ట్రాలకు అందజేశామని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్ చెప్పారు. ఆ డీపీఆర్‌లో హైడ్రాలజీ అంశంపై తమకు అభ్యంతరాలున్నాయని మురళీధర్ తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో భాగంగా వినియోగించాలని ప్రతిపాదించారని, ఇక్కడ నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు పేర్కొన్నారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్ వాటా ఉందని గుర్తు చేశారు. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని గత సమావేశంలో ఆ రాష్ట్రం తేల్చిచెప్పిందన్నారు. కాబట్టి ముందు గోదావరిలో నీటి లభ్యత తేల్చాలని కోరారు. ఏపీ అవసరాలు తీరాకే తరలింపు: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కూడా ముందు గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని కోరింది. రాష్ట్రంలో కడుతున్న, భవిష్యత్‌లో నిర్మించనున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోకుండాడీపీఆర్ రూపొందించారని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఆక్షేపించారు. గోదావరి జలాలు ఆ ప్రాజెక్టులకే సరిపోతాయని.. నీటి లభ్యత ఎక్కడుందని ప్రశ్నించారు. గోదావరి వరద (మిగులు) జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఏపీకే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ అవసరాలు తీర్చాకే వరద జలాల్లో మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. దీనిపై సానుకూలం గా స్పందించిన పంకజ్‌కుమార్.. గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాకే అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేశారు. మా రాష్ట్రంలో కరువు ప్రాంతాలెక్కువ: కర్ణాటక తమిళనాడుతో పోల్చితే కావేరి బేసిన్లో తమ రాష్ట్రంలోనే కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువని కర్ణాటక చెప్పింది. దుర్భిక్షాన్ని నివారించడానికి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఏపీతో పోల్చితే తమ రాష్ట్రంలోనే కృష్ణా బేసిన్లో కరువు పీడిత ప్రాంతాలు ఎక్కువంది. ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కృష్ణా బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకు గానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కోరింది. మిగతా రాష్ట్రాలేమన్నాయంటే..? కావేరి–గోదావరి అనుసంధానంలో కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర కోరింది. గోదావరి జలాల్లో తమ వాటా నీటిని కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని, తమ నీళ్లు తామే వాడుకుంటామని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది. ఒడిశా మాత్రం అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదంది. కావేరి జలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని, తాజా అనుసంధానం నేపథ్యంలోనైనా కావేరి జలాల పంపకంలో న్యాయం చేయాలని కేరళ కోరింది. వర్చువల్‌గా కాకుండా భౌతికంగా సమావేశాలు నిర్వహిస్తేనే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి అవకాశం ఉంటుందని తమిళనాడు చెప్పింది. తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న కావేరి బేసిన్‌కు గోదావరి జలాలను తరలించి ఆదుకోవాలని కోరింది. -
కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర భద్రత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతాబలగాల (సీఐఎస్ఎఫ్)తో రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించే ప్రక్రియను త్వరగా చేపట్టాలని హోంశాఖను కేంద్ర జల శక్తి శాఖ కోరింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియా మకానికి సంబంధించి బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, చేసుకోవాల్సిన ఒప్పందాలు తదితర అంశాలతో హోంశాఖ గోదావరి, కృష్ణా బోర్డు లకు లేఖ రాసింది. సిబ్బందికి కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలు, వాహ నాలు, కార్యాలయాల ఏర్పా టు, వారి జీతభత్యాలకు సం బంధించి కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ అశుతోష్ కుమార్ బోర్డులకు ఓ ముసా యిదా పత్రాన్ని పం పారు. అన్నింటికీ సీఐఎస్ఎఫ్ భద్రత కృష్ణా, గోదావరి నదులు, ఉప నదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ కేంద్ర గెజిట్‌లోని మొదటి షెడ్యూల్లో చేర్చగా, షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు వంద శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, చివరకు ఫర్నిచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోనికి తీసుకుని రోజువారీ నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాగా కేంద్ర గెజిట్ మేరకు ఈ ప్రాజెక్టులన్నిటికీ సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాల్సి ఉంది. బోర్డుల కసరత్తు నేపథ్యంలో.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వరకు అన్నింటినీ కృష్ణా బోర్డు తన స్వాధీనంలో ఉంచుకోనుండగా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు తన పరిధిలోకి తెచ్చు కోనుంది. ఆయా ప్రాజెక్టులు, సిబ్బంది, కార్యాలయాల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలను ఇప్పటికే బోర్డులు ఆదే శించాయి. ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్కేం ద్రాలు, విద్యుత్ సరఫరా లైన్లు, ఆఫీసులు, సిబ్బంది వివరాలను అందజేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రత దిశగా హోంశాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పె క్టర్లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, వారి బ్యారక్ లు, కార్యాలయాలు, వాటి నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై ముసాయిదా రూపొందించి బోర్డులకు పంపింది. ఈ ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం తెలుగు రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. -
కృష్ణమ్మ చెంత కరువు కరాళనృత్యం..
సాక్షి, కృష్ణా : ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన పాలకుల నిర్లక్ష్యంతో తీర ప్రాంతంలో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఏటా రెండు పంటలు, ఆక్వాసాగుతో కళకళలాడే ప్రాంతం కృత్తివెన్ను మండలం. కృష్ణా,గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతం కావడంతో ఇక్కడ కరవు అనే పదమే వినిపిం చేది కాదు. ఇలాంటి పచ్చని ప్రాంతంలో రెండు పంటలు కాదు కదా ఒక్క పంటకు కూడా నీరి వ్వకుండా రైతులను వ్యవసాయ కూ లీలుగా మార్చేసింది ప్రభుత్వం. 2014 ఎన్నికల తరువాత ఐదేళ్లలో రెండవ పంట కు నీరన్నదే లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకే సాగునీరు లేకుండాపోవ డం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువైన తాగునీరు.. సాగు సంగతి అలా ఉంటే కనీసం తాగునీరు అందించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. ఒ కానొక సమయంలో ప్రజలు తాగునీటి కోసం పోరాటానికి దిగిన సంఘటనలు లేకపోలేదు. దీనికి స్థానిక ఎమ్మెల్యే సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే నీటి కొరత ఏర్పడిందన్న వాదనలు వినిపిం చాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రెండు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం టీడీపీ అధికారం చేపట్టాక సాగునీరు, తాగునీటికి కరువై తీవ్రదుర్భిక్షాన్ని అనుభవించిందని ప్రజల్లో నాటుకు పోయింది. తీవ్ర దుర్భిక్షం నిత్యం రెండు పంటలతో కళకళలాడే ప్రాంతం మాది. ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగునీరు లేక పంటలు పండక రైతులే కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వ్యవసాయం మీద మక్కువతో రైతులు కష్టాలు ఎదురైనా పంటను సాగు చేస్తున్నారు.రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది. – ఆగిశెట్టి బాజ్జీ, గరిశపూడి గుక్కెడు నీటికి కష్టాలు సాగునీటి సంగతి దేవుడెరుగు. కనీసం తాగేందుకు కూడా నీరివ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో టీడీపీ పాలన సాగించింది. వరుసగా మూడేళ్లపాటు లక్ష్మీపురం రక్షిత మంచినీటి చెరువుకు నీరురాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – పులగం రాము, లక్ష్మీపురం -
ఖరీఫ్ ఎరువుకు గ్యాస్ దెబ్బ
నగరం పేలుడుతో మూతపడ్డ ఓఎన్జీసీ బావులు.. నిలిచిన గ్యాస్ సరఫరా గ్యాస్ సరఫరా లేక ఎరువులు, విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తికి 20 రోజులుగా బ్రేక్ ఒక్క నాగార్జున కర్మాగారంలోనే నిలిచిపోయిన రోజుకు 5,000 టన్నుల ఉత్పత్తి ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా6 రాష్ట్రాలకు ఆగిన యూరియా సరఫరా ఆగస్టు వరకు విదేశీ యూరియా దిగుమతులు రావడం కష్టమే.. దిగుమతి చేసుకున్న ఎరువులతో కేంద్రంపై పెరగనున్న భారం ఈ ఖరీఫ్‌లో వ్యవసాయానికి యూరియా కటకట తప్పదు: యూరియా సంస్థలు విద్యుత్ ప్లాంట్లకూ గ్యాస్ కొరత దెబ్బ - 750 మెగావాట్ల ఉత్పత్తికి బ్రేక్ కాకినాడ: కృష్ణా - గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ గ్యాస్ బావులు మూతపడటంతో.. గ్యాస్ సరఫరా లేక ఎరువుల ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులకు తీవ్ర కొరత ఎదురుకానుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) గ్యాస్ పైపులైన్ పేలుడుతో సహజ వాయువు ఉత్పత్తి చేసే సుమారు 70 ఓఎన్జీసీ బావులు మూతపడి మూడు వారాలైంది. దాంతో సహజ వాయువు సరఫరా నిలిచిపోయి, గ్యాస్‌పై ఆధారపడ్డ విద్యుత్, ఎరువుల ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. బావుల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదని పైపులైన్ల నాణ్యతపై సర్వే చేస్తున్న ‘ఇంజనీర్స్ ఇండియా’ అభిప్రాయపడుతోంది. గ్యాస్ సరఫరా లేక ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్స్ మూమెంట్స్ ఆర్డర్ ఆధారంగా జరగాల్సిన యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో యూరియా అవసరాల్లో దాదాపు సగం యూరియా కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం తీరుస్తుంటుంది. గ్యాస్ సరఫరా లేక యూరియా ఉత్పత్తి నిలిచిపోగా మరోపక్క విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా కూడా ఆగస్టు నెలాఖరు వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు... గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఖరీఫ్‌లో యూరియా కొరత పెనుసమస్య కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘నాగార్జున’లో నిలిచిన ఉత్పత్తి నాగార్జున కర్మాగారంలో గ్యాస్ సరఫరా జరిగే రోజుల్లో రోజుకు 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగేది. కేంద్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగాఏటా సుమారు20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉంది. గెయిల్ నుంచి నాగార్జునలోని రెండు ప్లాంట్లకు రోజుకు 3.15 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కావాలి. వాస్తవంగా గెయిల్ నుంచి సరఫరా అవుతున్నది 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లే. నగరం పైపు లైన్ పేలుడు తరువాత ఆ సరఫరా కూడా నిలిచిపోయింది. 20 రోజులుగా నాగార్జునలో 14.50 లక్షల నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక్కడ ఉత్పత్తయ్యే యూరియా ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించే కోటా ప్రకారం రైల్వే ర్యాక్‌ల ద్వారా సరఫరా చేస్తుంటారు. సరఫరా నిలిచిపోవడంతో నాగార్జున రోజుకు సుమారు రెండు కోట్ల టర్నోవర్‌ను కోల్పోయింది. పునర్విభజనకు ముందున్న రాష్ట్రంలో ఖరీఫ్ అవసరాలకు 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా. దీన్లో సుమారు 14.50 లక్షల మెట్రిక్ టన్నులు నాగార్జున కర్మాగారంలో ఉత్పత్తి అయితే 26 లక్షల టన్నులు ఒమన్, దుబాయ్, కువైట్ తదితర గల్ఫ్ దేశాల నుంచి కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం తదితర ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకోవలసి ఉంది. యూరియా ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు రెండు రోజుల కిందట కేంద్ర పెట్రోలియం మంత్రిని, గెయిల్ చైర్మన్‌ను కలిసి గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించకుంటే ఎరువులకు కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కేంద్రం నిర్ణయించిన ప్రకారం రైతులకు టన్ను యూరియాను రూ. 5,500కు విక్రయిస్తుండగా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియా టన్నుకు 350 డాలర్లు (సుమారు రూ. 20 వేలు) అవుతుంది. ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్న యూరియా కేంద్ర సర్కారుకు భారమవుతోంది. మూతపడ్డ పవర్ ప్లాంట్లు: గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ సంక్షోభం కూడా రాష్ట్రాన్ని పీడిస్తోంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ స్పెక్ట్రమ్, ల్యాంకో, విజ్జేశ్వరం, జెన్కో తదితర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఓఎన్జీసీ బావులతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల బావుల్లో మరో 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ బావుల నుంచి గెయిల్ విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, ఉప్పాడ తీరంలోని స్ప్రెక్టమ్ తదితర విద్యుదుత్పత్తి ప్లాంట్లకు రోజూ సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా చేసేది. ఇప్పుడు గ్యాస్ సరఫరా కాక 750 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. 20 రోజులుగా సుమారు 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 100 నుంచి 150 మెగావాట్లు ఉత్పత్తి చేసే విజ్జేశ్వరం, స్పెక్ట్రమ్ ప్లాంట్లు, సుమారు 200 మెగావాట్లు ఉత్పత్తి చేసే వేమగిరి పవర్ ప్రాజెక్టు, 300 మెగావాట్లు ఉత్పత్తిచేసే ల్యాంకో పవర్ప్రాజెక్టు మూతపడ్డాయి. గెయిల్ పైపులైన్లను అధ్యయనం చేస్తున్న ఇంజనీర్స్ ఇండియా నివేదిక వచ్చేసరికి ఎంతలేదన్నా రెండు, మూడు నెలలు పడుతుందని ఓఎన్జీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూరియా, విద్యుత్ కొరతలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.