లైంగిక వేధింపుల వార్త షాకిచ్చింది: అమీర్ ఖాన్
మహిళా జర్నలిస్ట్ పై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త షాక్ కు గురి చేసింది అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. ఓ మహిళ జర్నలిస్ట్ తో తేజ్ పాల్ అలా ప్రవర్థించడం నమ్మలేకపోయాను అని అన్నారు. ఈ కేసులో తరుణ్ తేజ్ పాల్ ప్రవర్తన తనను నిరుత్సాహపరిచిందని అన్నాడు. ఈ ఘటన అత్యంత విషాదకరమైంది అని అమీర్ అన్నారు.
ఈ ఘటనలో మహిళా జర్నలిస్టుకు మనమంతా బాసటగా నిలువాలని అమీర్ సూచించారు. ఇలాంటి పరిస్తితిని ఎదుర్కొనడం ఏ మహిళకైనా చాలా కష్టమైన పనియే అని అన్నారు. భౌతిక, లైంగిక వేధింపులు, అత్యాచార సంఘటనలు మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించలేనివని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులు తమ విధులను పకడ్భందీగా నిర్వహించాలని అమీర్ సూచించారు. అత్యాచారం అనేది ఓ హింసాత్మక సంఘటన అని అమీర్ వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే రెండవ భాగంలో కొన్ని కీలక సమస్యలను, సీరియస్ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నానని అమీర్ తెలిపారు.