తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ | bombay Court to hear Tejpal's bail plea today | Sakshi
Sakshi News home page

తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ

Published Tue, Mar 4 2014 10:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ

తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ

పనాజి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటీషన్ పై మంగళవారం బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 18 వ తేదీన వాదనలు విన్న  కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని అందించాలని కోర్టు క్రైంబ్రాంచ్ ను కోరింది. బెయిల్ పిటీషన్ పై తేజ్ పాల్ ను నేడు కోర్టులో హాజరు పరుచనునున్నారు. అంతకుముందు తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 

 

గత కొన్ని నెలులుగా తేజ్ పాల్ జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.అతనిపై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354, 354-ఏ సెక్షన్లు, దురద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసినందకు 341 ,342 సెక్షన్లు, అత్యాచార అభియోగాల క్రింద 376,376(2)(ఎఫ్), 376(2)(కె)  సెక్షన్ల ను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు.

 

గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement