తేజ్పాల్ పోలీస్ కస్టడీ పొడగింపు | Tarun Tejpal's police custody extended | Sakshi
Sakshi News home page

తేజ్పాల్ పోలీస్ కస్టడీ పొడగింపు

Published Sat, Dec 7 2013 5:00 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగించారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడగించారు. మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

తేజ్పాల్కు తొలుత ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించిన న్యాయస్థానం తాజాగా ఈ నెల 10 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తేజ్పాల్ను శనివారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణలో భాగంగా పోలీసులు ఆయనకు ఇటీవల లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. పలువురు సాక్షులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement