తేజ్పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే | Centre cannot interfere in Tehelka case:Sushilkumar Shinde | Sakshi
Sakshi News home page

తేజ్పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే

Published Sun, Dec 1 2013 5:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

తేజ్పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే - Sakshi

తేజ్పాల్ కేసుకు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదు:షిండే

ముంబై: తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు కాంగ్రెస్ రక్షణ కవచంగా లేదని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడట్టు ఆరోపణలు రావడంతో తేజ్పాల్కు గోవా కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. తేజ్పాల్ అరెస్టు, కేసు విషయాల్లో కాంగ్రెస్ సంబంధం లేదని షిండే తెలిపారు. ఈ అంశంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.

 

అత్యాచార ఆరోపణల అనంతరం తేజ్పాల్ అరెస్టు ఆలస్యం కావడంతో కాంగ్రెస్పై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. తేజ్పాల్ను కాంగ్రెస్ కాపాడుతుందంటూ బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో  స్పందించిన షిండే.. అటువంటి ఘటనలకు కాంగ్రెస్ ఎప్పుడూ వంతపాడదని తెలిపారు. తేజ్ పాల్ అంశం వేరే రాష్ట్రానికి సంబంధించింది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement