కాంగ్రెస్‌కు పునర్వైభవం ఖాయం | hopes definetly preglory comes to congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పునర్వైభవం ఖాయం

Published Sun, Dec 28 2014 10:21 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

hopes definetly preglory comes to congress

కేంద్ర మాజీమంత్రి షిండే ఆశాభావం

ముంబై: కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 130వ వ్యవస్థాపక దినోత్సవాన్ని  ముంబై సబర్బన్‌లో ఉన్న తిలక్ భవన్‌లో ఆదివారం జరుపుకున్నారు. ఐదేళ్ల తర్వాత తమ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని షిండే అన్నారు.

ఈ మేరకు పార్టీని పునర్మించేందుకు అధిష్టానం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ మంత్రి నారాయణ్ రాణే, అసెంబ్లీ విపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement