ఢిల్లీ కోర్టులో తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లో తెహల్కా గ్రూప్ నిర్వహించిన థింక్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తేజ్ పాల్ పై సహ ఉద్యోగి కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనపై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం తేజ్ పాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు.