తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు | Tehelka magazine editor Tarun tejpal accused of molestation by woman Colleague | Sakshi
Sakshi News home page

తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు

Published Thu, Nov 21 2013 12:22 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు - Sakshi

తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

న్యూఢిల్లీ :  సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే  'తెహల్కా' మేగజీన్ మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే ఏకంగా ఆ పత్రిక వ్యవస్థాపకుడు, ఎడిటర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా  చేయాల్సి వచ్చింది.  తెహల్కా ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం తన పదవికి ఆరు నెలల పాటు రాజీనామా చేశారు. 

గోవాలో ఆ పత్రిక నిర్వహించిన 'థింక్' ఫెస్టివల్ కార్యక్రమంలో తరుణ్ తేజ్పాల్ ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆమె ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తెహల్కాను 2000లో ప్రారంభించిన తరుణ్‌ తేజ్‌పాల్‌ అంతకు ముందు అనేక ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. అనతి కాలంలోనే అనేక సంచలన కథనాలను వెలుగులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా మహిళా జర్నలిస్టుకు ఇతర మహిళలు నుంచి మద్దతు లభిస్తుంది. దీనిపై కిరణ్ బేడీ స్పందిస్తు లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని... అయితే చట్టం బాధితురాలికి అండగా ఉంటుందన్నారు. మరో మహిళ హక్కుల నేత కవిత కృష్ణన్ మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి  ఆరు నెలల పాటు పదవికి దూరంగా ఉండటం చాలా చిన్న విషయమని అన్నారు.  మరోవైపు  తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వివరాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement