'తేజ్ పాల్, తెహల్కాతో సంబంధాలు లేవు'
తరుణ్ తేజ్ పాల్ తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. తెహల్కా మ్యాగజైన్ లో తనకు వాటాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణల్ని సిబాల్ ఖండించారు. తేజ్ పాల్ తల్లి సిబాల్ చెల్లెలు అనే సందేశాలు సోషల్ మీడియా వెబ్ సైట్ లో విహారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తనపై దుష్ఫ్రచారం మానుకోవాలని సిబాల్ విజ్క్షప్తి చేశారు. రాజకీయంగా తనపై దాడి చేసుకోవచ్చు. కాని తన కుటుంబాన్ని తేజ్ పాల్ వ్యవహారంలోకి లాగకూడదు. తేజ్ పాల్ తల్లి తనకు చెల్లెలు కాదు అని సిబాల్ అన్నారు.
తెహల్కా వ్యవస్థాకులు, వాటాదారుడైన ఓ కేంద్ర మంత్రి తరుణ్ తేజ్ పాల్ ను రక్షిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీలపై తాను విమర్శిస్తున్నందునే తనపై దుష్ర్షచారాన్ని చేస్తున్నాయి అని ఆయన అన్నారు. తనకు తేజ్ పాల్ కు మధ్య ఉన్న సంబంధాలను బహిరంగపర్చాలని సిబాల్ సవాల్ విసిరారు. అంతేకాక కోట్లాది రూపాయల మైనింగ్ కుంభకోణానికి కారణమైన రెడ్డి బ్రదర్స్ ( గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర రెడ్డి)లను సుష్మా స్వరాజ్ కాపాడుతోంది అని సిబాల్ ఆరోపించారు.