హాలీవుడ్ నటుడిని కలుద్దామంటూ కీచకం!
తేజ్‌పాల్‌పై మహిళా జర్నలిస్టు ఆరోపణ
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగికదాడికి పాల్పడినట్లు తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై గోవా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో పేరు ప్రస్తావనకు వచ్చింది. డినీరోను కలుద్దామని ప్రలోభపెట్టి తేజ్‌పాల్ బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసినట్లు అందులో ఉంది. తెహెల్కాలోనే పనిచేస్తున్న బాధితురాలు ఆ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరికి చేసిన ఫిర్యాదులో ఈమేరకు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 7, 8న గోవాలోని గ్రాండ్ హయత్ హోటల్లో తేజ్‌పాల్ లిప్టులో తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించడం తెలిసిందే. ఈ నెల 8, 9న ఆ హోటల్లో జరిగిన ‘తెహెల్కా థింక్‌ఫెస్ట్’లో డినీరో ప్రధాన వక్త. బాధితురాలు చౌదరికి చేసిన ఫిర్యాదులోని వివరాలు ఆమె మాటల్లోనే..‘‘తేజ్‌పాల్ లిఫ్టు ఎక్కడా ఆగకుండా బటన్లు నొక్కారు. కాసేపయ్యాక డినీరో ఉన్న రెండో అంతస్తులో లిఫ్టు డోర్ తెరుచుకుంది. ‘విశ్వం మనకో సంగతి చెబుతోంది’ అని తేజ్‌పాల్ చెప్పారు. నేను మెట్లగుండా వెళ్తానని లిఫ్టులోంచి బయటకు రాబోయాను. దీంతో ఆయన నన్ను లిఫ్టులోకి లాగారు. నాపై భౌతికదాడి చేశారు.’’
ప్రశ్నించకుండానే...
ఈ కేసు దర్యాప్తు కోసం ఆదివారం ఢిల్లీ వచ్చిన గోవా పోలీసులు తేజ్‌పాల్‌ను ప్రశ్నించకుండానే వెళ్లిపోయారు. వారు తేజ్‌పాల్‌ను ప్రశ్నించడానికి కానీ, అరెస్టు చేయడానికి కానీ రాలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. వారు బాధితురాలిని కలుసుకుని అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరారని, ఫిర్యాదు చేశాక తేజ్‌పాల్‌ను అరెస్టు చేసే అవకాశముం దని అన్నాయి.
గోవా పోలీసులు.. మహిళా జర్నలిస్టు, చౌదరి, తేజ్‌పాల్‌ల ఈ-మెయిళ్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చే సుకున్నారు. బాధితురాలి సహోద్యోగులైన ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఆమెకు రక్షణ కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ ముంబై పోలీసులను కోరింది. తనపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టు అబద్ధాలాడుతోందని తేజ్‌పాల్ ఆరోపించినట్లు సమాచారం.