తెహల్కా ఎడిటర్‌ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ | Tarun Tejpal to Appear Before Goa Court in Rape Case on 28 Sept | Sakshi
Sakshi News home page

తరుణ్‌ తేజ్‌పాల్‌కు ఎదురు దెబ్బ

Published Thu, Sep 7 2017 3:22 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Tarun Tejpal to Appear Before Goa Court in Rape Case on 28 Sept

గోవా : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై తరుణ్‌ తేజ్‌పాల్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసు ఫైనల్‌ ఛార్జ్‌షీటులో 376 సెక్షన్‌ లేదని అన్నారు.

 కాగా తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్ట్ను తేజ్పాల్ లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని  మహిళా జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. హోటల్‌లోని ఓ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ తనను వేధించారంటూ బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement