తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
Published Tue, Nov 26 2013 10:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
సహచర ఉద్యోగిపై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని నమోదైన కేసు హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డి నీరో మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో రాబర్డ్ డి నీరోకు ఎలాంటి ప్రమేయం లేకున్నా మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ ను గోవా డీఐజీ ఓపి మిశ్రా ప్రశ్నించే అవకాశం ఉంది.
తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తున్నామని మిశ్రా మీడియాకు తెలిపారు. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరీ ఫిర్యాదు మేరకే రాబర్డ్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
రాబర్డ్ డీ నిరోతో సమావేశమవ్వాలనే కారణంతో సహచర ఉద్యోగిని పిలిచి... లిఫ్ట్ లో లైంగికంగా వేధించినట్టు షోమా ఫిర్యాదు తెలిపింది. గోవాలో నవంబర్ 8, 9 తేదిల్లో తెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్డ్ డి నీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు.
Advertisement
Advertisement