Shoma Chaudhury
-
లైంగిక దాడి కేసులో షోమా చౌదరి స్టేట్మెంట్ రికార్డు
తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి స్టేట్మెంట్ను గోవా కోర్టు శనివారం రికార్డు చేసింది. సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరయ్యేందుకు షోమా చౌదరి శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి గోవా చేరుకున్నారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కస్టడీ ముగియటంతో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా మరో వారం పాటు తేజ్‌పాల్ కస్టడీ పొడిగించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను అరెస్టు చేయడం తెలిసిందే. -
జోలీని మరోసారి ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ:తెహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి నివాసం వద్ద ఘర్షణకు దిగిన కేసులో బీజేపీ నాయకుడు విజయ్ జోలీని పోలీసులు రెండోరోజైన శనివారం కూడా ప్రశ్నించారు. సాకేత్ పోలీసులు ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు విచారణ నిర్వహించా రు. జోలీ నేరాన్ని అంగీకరించడంతో తమకు కొన్ని ఆధారాలు దొరికాయని, సోమవారం ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. జోలీని శుక్రవారం కూడా ఐదు గంటలసేపు ప్రశ్నించడం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడ్డ జర్నలిస్టు తరుణ్ తేజ్పాల్ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ జోలీ నేతృత్వంలోని 50 మంది కార్యకర్తలు గురువారం షోమా ఇంటి ముందున్న నేమ్‌ప్లేట్‌కు రంగువేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ వివరణ ఇచ్చింది. ఈ ఆందోళనకు తాము అనుమతి ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. -
తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ రాజీనామా
న్యూఢిల్లీ: తరుణ్ తేజ్పాల్ను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి గురువారం రాజీనామా చేశారు. లైంగిక వే ధింపుల వ్యవహారంలో ఒక స్త్రీవాదిగా తన మనస్సాక్షి మేరకు వ్యవహరించానని, అయినా తనపై ఆరోపణలు రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. అందుకే తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ ఉద్యోగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ఈ వేధింపుల కేసులో మరింత సమర్థంగా వ్యవహరించాల్సిందన్న సూచనలను నేను అంగీకరిస్తున్నా. అయితే నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడం లేదు. నా నిజాయతీని సహోద్యోగులతోపాటు చాలా మంది ప్రశ్నించారు. నన్ను అడ్డం పెట్టుకొని తెహెల్కాపై బురద చల్లాలనుకునే వారికి నేను అవకాశం ఇవ్వదల్చుకోలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. తేజ్‌పాల్ లైంగిక వేధింపుల అంశాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు, కేవలం బాధితురాలికి క్షమాపణ చెప్పించి రాజీ కుదిర్చేందుకు యత్నించారని షోమాపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. బాధితురాలికి షోమా న్యాయం చేయ డం లేదని ఆరోపిస్తూ తెహెల్కాలోని పలువిభాగాల ఎడిటర్లు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరించినందుకు షోమా పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షోమా ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల హంగామా బీజేపీ కార్యకర్తలు గురువారం ఢిల్లీలోని షోమా ఇంటి ముందు ధర్నాకు దిగారు. లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి అన్యాయం చేయాలని చూసినందుకు ఆమెను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. షోమాకు, తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తలతో కలసి షోమా నివాసానికి చేరుకున్న పార్టీ నేత విజయ్ జోలీ.. నానా హంగామా చేశారు. షోమా చౌదరి ఇంటి ముందున్న నేమ్‌ప్లేట్‌పై అక్యూస్డ్ (నిందితురాలు) అని రాశారు. ఇంటిముందు నల్ల పెయింట్ వేశారు. ఈ నిరసన మధ్యే షోమా తన ఇంటినుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి ముఖంపై సిరా చల్లడానికి ప్రయత్నించారు. కొందరు కార్యకర్తలు షోమా కారుపైకి ఎక్కారు. పోలీసుల సాయంతో ఆమె జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. తాము వారించినప్పటికీ జోలీ నిరసన ప్రదర్శన నిర్వహించారని ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. మహిళా కమిషన్‌కు షోమా క్షమాపణలు లైంగిక వేధింపుల కేసులో సరైన చర్యలు తీసుకోనందుకు షోమా చౌదరి గురువారం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు క్షమాపణలు చెప్పారు. కమిషన్ గోవా ఇన్చార్జి షమీనా షఫీక్‌ను కలసి ఈ మేరకు క్షమాపణలు కోరారు. సంస్థలో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయకపోవడం తప్పిదమేనని చెప్పారు. -
షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన
ఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ మాజీ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు గురువారం బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఆమె మహిళ అయ్యి కూడా సాటి మహిళలకు అండగా నిలవకపోవడం చాలా బాధాకరమని ఆందోళనలో పాల్గొన్నబీజేపీ నేత విజయ్ జోలీ తెలిపారు. ఇది యావత్తు మహిళా లోకమే తలదించుకునేలా ఉందని జోలీ తెలిపారు. తేజ్ పాల్ కు అండగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తేజ్ పాల్ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
-
తెహల్కాకు షోమాచౌదరి రాజీనామా
న్యూఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి షోమా చౌదరి రాజీనామా చేశారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక తరుణ్ తేజ్‌పాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. దాంతో విచారణ అనంతరం తేజ్పాల్ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోవాలోని ఓ హోటల్లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తేజ్పాల్పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది. -
తేజ్ పాల్ కేసులో 'గాడ్ ఫాదర్ 2'ను ప్రశ్నించనున్న పోలీసులు!
సహచర ఉద్యోగిపై తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని నమోదైన కేసు హాలీవుడ్ అగ్రనటుడు రాబర్ట్ డి నీరో మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో రాబర్డ్ డి నీరోకు ఎలాంటి ప్రమేయం లేకున్నా మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన పేరును ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా రాబర్డ్ ను గోవా డీఐజీ ఓపి మిశ్రా ప్రశ్నించే అవకాశం ఉంది. తేజ్ పాల్ పై నమోదైన ఈ కేసులో 'గాడ్ ఫాదర్ 2' సాక్ష్యం కీలకంగా మారడంతో రాబర్ట్ ను విచారిస్తున్నామని మిశ్రా మీడియాకు తెలిపారు. వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఈ కేసుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరీ ఫిర్యాదు మేరకే రాబర్డ్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రాబర్డ్ డీ నిరోతో సమావేశమవ్వాలనే కారణంతో సహచర ఉద్యోగిని పిలిచి... లిఫ్ట్ లో లైంగికంగా వేధించినట్టు షోమా ఫిర్యాదు తెలిపింది. గోవాలో నవంబర్ 8, 9 తేదిల్లో తెహల్కా నిర్వహించిన థింక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాబర్డ్ డి నీరో ప్రధాన వక్తగా వ్యవహరించారు.