జోలీని మరోసారి ప్రశ్నించిన పోలీసులు | Vijay Jolly questioned again, asked to appear on Monday | Sakshi
Sakshi News home page

జోలీని మరోసారి ప్రశ్నించిన పోలీసులు

Published Sat, Nov 30 2013 11:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

తెహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి నివాసం వద్ద ఘర్షణకు దిగిన కేసులో బీజేపీ నాయకుడు విజయ్ జోలీని పోలీసులు రెండోరోజైన శనివారం కూడా ప్రశ్నించారు.

న్యూఢిల్లీ:తెహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి నివాసం వద్ద ఘర్షణకు దిగిన కేసులో బీజేపీ నాయకుడు విజయ్ జోలీని పోలీసులు రెండోరోజైన శనివారం కూడా ప్రశ్నించారు.  సాకేత్ పోలీసులు ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు విచారణ నిర్వహించా రు. జోలీ నేరాన్ని అంగీకరించడంతో తమకు కొన్ని ఆధారాలు దొరికాయని, సోమవారం ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. జోలీని శుక్రవారం కూడా ఐదు గంటలసేపు ప్రశ్నించడం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడ్డ జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ జోలీ నేతృత్వంలోని 50 మంది కార్యకర్తలు గురువారం షోమా ఇంటి ముందున్న నేమ్‌ప్లేట్‌కు రంగువేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ వివరణ ఇచ్చింది. ఈ ఆందోళనకు తాము అనుమతి ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement