vijay jolly
-
గప్‌చుప్ తింటుండగా మాజీ ఎమ్మెల్యేపై దోపిడీ!
రోడ్డుపక్కన ఉన్న గప్‌చుప్‌ల బండి వద్ద ఆగి పానీపూరి తింటుండగా.. ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపక్కన కారు ఆపి.. తన స్నేహితుడితో కలిసి తీరికగా గప్‌చుప్‌లు తింటుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన కారులో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగును దొంగలించారు. ఆ బ్యాగులో ఆయన ల్యాప్‌టాప్‌తోపాటు డిజిటల్ కెమెరా, పార్టీ సీనియర్ నేతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. బుధవారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని లాడో సరై ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దొంగలను వెంటాడి పట్టుకొనేందుకు బీజేపీ నేత ప్రయత్నించినప్పటికీ ట్రాఫిక్ ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయ్ జోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎవరన్నది ఇంకా తెలియలేదు. విజయ్ జోలీ బుధవారం సాయత్రం తన ఐ20 కారులో సంగం విహార్ నుంచి జానకీపూర్ బయలుదేరారు. ఆయన వెంట స్నేహితుడు కూడా ఉన్నారు. ఇద్దరు లాడో సరై ప్రాంతంలో రోడ్డు పక్కన కారును పార్క్ చేసి.. పక్కనే ఉన్న గప్‌చుప్‌ల బండి దగ్గరికి వెళ్లారు. అక్కడ తాము గప్‌చుప్‌లు తింటుండగానే బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కారు కిటికీ అద్దాన్ని పగులకొట్టి కారులోని ల్యాప్బ్యాగ్ను ఎత్తుకెళ్లారని, వారిని పట్టుకునేందుకు తాను ప్రయత్నించినా ట్రాఫిక్ ఉండటంతో వీలుపడలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
గురుగ్రామ్: ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే బుక్కయ్యాడు. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి కటకటాల పాలయ్యారు. ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376(లైంగికదాడి) 328(మత్తుపదార్థాలు, విషంలాంటివి ఇచ్చి హానీ చేయడం), 506(నేర పూరిత ఉద్దేశంతో చేసే పని) కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయ్ జాలీ అనే బీజేపీ నేత గతంలో సాకేత్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, ఆయనను కలిసేందుకు వచ్చిన తనకు గుర్గావ్లోని అప్నో ఘర్ అనే రిసార్ట్‌లో ఈ నెల(ఫిబ్రవరి) 10న కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడమే కాకుండా డ్రగ్స్ తీసుకొని తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించగా.. ఆ మహిళపై సదరు నేత తిరిగి కేసు పెట్టారు. తనపై ఉద్దేశ పూర్వకంగా ఆ మహిళ కేసు పెట్టి బెదిరిస్తుందని, ఆమె చెప్పేవన్నీ కూడా అబద్ధాలని ఆరోపిస్తూ మీడియాకు చెప్పారు. ఆమె తొలుత తనను బెదిరించిందని, దానికి ఒప్పుకోకపోవడంతోనే ఇలా లైంగిక దాడి ఆరోపణలు చేస్తుందని తెలిపారు. -
'శాసనసభ నిబంధనల్ని కేజ్రివాల్ ఉల్లంఘించారు'
న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శాసన సభ నియమ నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నేత విజయ్ జాలీ విమర్శించారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ టోపిని కేజ్రివాల్ పెట్టుకోవడాన్ని జోలీ తప్పపట్టారు. పార్టీ పేరుతో ఉన్న టోపిని ధరించి తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రివాల్ పాల్గొన్నారు. శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి బ్యాడ్జీలు ధరించకూడదని ఆయన తెలిపారు. పార్టీ స్లోగన్ తో ఉన్న టోపిని ధరించడం నియమ నిబంధనలకు విరుద్దం అని విజయ్ జాలీ అన్నారు. ఎన్నికల అనంతరం తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. శాసనసభ్యుడిగా కేజ్రివాల్ తోపాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నేత మాతిన్ ఆహ్మాద్ ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జోలీని మరోసారి ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ:తెహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి నివాసం వద్ద ఘర్షణకు దిగిన కేసులో బీజేపీ నాయకుడు విజయ్ జోలీని పోలీసులు రెండోరోజైన శనివారం కూడా ప్రశ్నించారు. సాకేత్ పోలీసులు ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు విచారణ నిర్వహించా రు. జోలీ నేరాన్ని అంగీకరించడంతో తమకు కొన్ని ఆధారాలు దొరికాయని, సోమవారం ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. జోలీని శుక్రవారం కూడా ఐదు గంటలసేపు ప్రశ్నించడం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడ్డ జర్నలిస్టు తరుణ్ తేజ్పాల్ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ జోలీ నేతృత్వంలోని 50 మంది కార్యకర్తలు గురువారం షోమా ఇంటి ముందున్న నేమ్‌ప్లేట్‌కు రంగువేశారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ వివరణ ఇచ్చింది. ఈ ఆందోళనకు తాము అనుమతి ఇవ్వలేదని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. -
జోలీ అత్యుత్సాహంపై జర్నలిస్టుల ఆగ్రహం
న్యూఢిల్లీ: తహెల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు జోడీ హల్చల్ చేయడాన్ని ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ తప్పుబట్టింది. జోలీ వ్యహరించిన తీరును ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(డీయూజే)కు చెందిన జెండర్ అండ్ ఎథిక్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. చౌదరీ నేమ్ ప్లేట్‌పై ‘నిందితురాలు’ అని రాసి, ప్రదర్శించడాన్ని డీయూజే తప్పుబట్టింది. తహెల్కా యజమాని తరుణ్ తేజ్పాల్పై నమోదైన కేసులో షోమా నిందితురాలు కాదనే విషయాన్ని జోలీ గుర్తించాని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు కలుగజేసుకోకపోతే షోమాపై విజయ్ జోలీ అనూయాయులు దాడి కూడా చేసుండేవారని ఆరోపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, జోలీ తీరును ఖండిస్తారని ఆశిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. జోలీని విచారించిన పోలీసులు... గురువారం చోటుచేసుకున్న ఘటనపై విచారించేందుకు ఢిల్లీ పోలీసులు బీజేపీ నేత విజయ్ జోలీని సాకేత్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్‌కు వచ్చిన జోలీని సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. శనివారం కూడా స్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పారు. ఆయన నుంచి వాంగ్మూలం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. జోలీని అరెస్టు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఆయనపై కేసు నమోదు చేశాం. అందుకే విచారించాం. అవసరమైతే అరెస్టు చేస్తామ’ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ సంస్కృతికి అద్దం పట్టింది: కాంగ్రెస్ షోమా చౌదరి ఇంటిముందు జోలీ వ్యవహరించిన తీరు బీజేపీ సంస్కృతికి అద్దం పట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. జోలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. -
దీపావళి కానుకగా సీఎంకు ఉల్లిగడ్డలు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత విజయ్ జోలీ సోమవారం ఓ వినూత్నమైన కానుకతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నివాసానికి సోమవారం చేరుకున్నారు. కిలో వంద రూపాయల విలువైన ఉల్లిగడ్డలతో నిండిన బుట్టను ఆమెకి కానుకగా ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 20 కిలోల ఉల్లిపాయల బుట్టతో పాటు మిఠాయిడబ్బాను దీపావళి కానుకగా తీసుకొచ్చానని తెలిపారు. వారం రోజులుగా షీలాదీక్షిత్ ఉల్లిపాయలు తినడం లేదన్న సంగతి తెలిసి ఈ విధంగా వచ్చానన్నారు. ఉల్లి ధర ఆకాశాన్ని అంటడంతో తాను ఉల్లితినడం మానేశానని ముఖ్యమంత్రి గతంలో చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఎద్దేవా చే శారు. ధరల పెరుగదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,పండుగలు చప్పబడిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం తాను కానుకగా ఉల్లిపాయలు, మిఠాయిని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. విజయ్ జోలీ గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయారు. వినూత్నమైన ప్రచారశైలిలో ప్రచారం నిర్వహించడం ఆయన ప్రత్యేకత. 125 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకం తక్కువ ధరకు ఉల్లిపాయలను నగరవాసులకు అందించడం కోసం ప్రభుత్వం ఉల్లిపాయలను విక్రయించే 125 వ్యాన్లను నగరంలో మోహరించారు. ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా కిలో ఉల్లిగడ్డలను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు.