బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు | Former Delhi BJP MLA Vijay Jolly Booked For Rape | Sakshi
Sakshi News home page

బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

Published Thu, Feb 23 2017 1:27 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై రేప్‌ కేసు

గురుగ్రామ్‌: ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే బుక్కయ్యాడు. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి కటకటాల పాలయ్యారు. ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376(లైంగికదాడి) 328(మత్తుపదార్థాలు, విషంలాంటివి ఇచ్చి హానీ చేయడం), 506(నేర పూరిత ఉద్దేశంతో చేసే పని) కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయ్‌ జాలీ అనే బీజేపీ నేత గతంలో సాకేత్‌ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే, ఆయనను కలిసేందుకు వచ్చిన తనకు గుర్గావ్‌లోని అప్నో ఘర్‌ అనే రిసార్ట్‌లో ఈ నెల(ఫిబ్రవరి) 10న కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడమే కాకుండా డ్రగ్స్‌ తీసుకొని తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించగా.. ఆ మహిళపై సదరు నేత తిరిగి కేసు పెట్టారు. తనపై ఉద్దేశ పూర్వకంగా ఆ మహిళ కేసు పెట్టి బెదిరిస్తుందని, ఆమె చెప్పేవన్నీ కూడా అబద్ధాలని ఆరోపిస్తూ మీడియాకు చెప్పారు. ఆమె తొలుత తనను బెదిరించిందని, దానికి ఒప్పుకోకపోవడంతోనే ఇలా లైంగిక దాడి ఆరోపణలు చేస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement