'శాసనసభ నిబంధనల్ని కేజ్రివాల్ ఉల్లంఘించారు'
న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శాసన సభ నియమ నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ నేత విజయ్ జాలీ విమర్శించారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ టోపిని కేజ్రివాల్ పెట్టుకోవడాన్ని జోలీ తప్పపట్టారు.
పార్టీ పేరుతో ఉన్న టోపిని ధరించి తొలిసారి అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రివాల్ పాల్గొన్నారు. శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి బ్యాడ్జీలు ధరించకూడదని ఆయన తెలిపారు. పార్టీ స్లోగన్ తో ఉన్న టోపిని ధరించడం నియమ నిబంధనలకు విరుద్దం అని విజయ్ జాలీ అన్నారు.
ఎన్నికల అనంతరం తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. శాసనసభ్యుడిగా కేజ్రివాల్ తోపాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నేత మాతిన్ ఆహ్మాద్ ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.